ముఖ్యమంత్రిని చంపేస్తే మిలియన్ డాలర్ల రివార్డు ఇస్తానంటూ పోస్టర్ వేసి కలకలం సృష్టించిన ఘటన పంజాబ్‌లో జరిగింది. సెక్టార్ 66-67 క్రాసింగ్ సమీపంలోని ఒక గైడ్ మ్యాప్‌పై పోస్టర్ అంటించారు.. ఆ పోస్టర్ సారాంశం ప్రకారం.. పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను చంపేస్తే.. మిలియన్ డాలర్ల రివార్డు ఇస్తాం.. ఇది స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.. సీఎంపై ఇలా పోస్టర్ వేసిన సంగతి స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు.. ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే, పోస్టర్‌పై ఈ-మెయిల్ అడ్రస్‌ను గుర్తించారు పోలీసులు.. ఈ పోస్టర్ వేసిన అగంతుకునిపై ఐపీసీ సెక్షన్ 504, 506, 120బీ కింద, పంజాబ్ ప్రివెన్షన్ ఆఫ్ డీఫేస్‌మెంట్ ప్రాపర్టీ ఆర్డినెన్స్ యాక్ట్ 1997 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు మొహాలీ సిటీ పోలీసులు.. ఇక, ఆ పోస్టర్ వేసిన ప్రాంతంలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. ఆ ఫుటేజ్ ఆధారంగా అగంతకుని కోసం వేట ప్రారంభించారు.. అయితే, డిసెంబర్ 31వ తేదీన ఈ పోస్టర్ వేసినట్టు చెబుతున్నారు పోలీసులు.. ఏంకగా సీఎంనే టార్గెట్ చేయడంతో.. పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు.. ఆకతాయిల పనా? లేక కుట్ర దాగి ఉందా? అనే కోణంలోనూ పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది.
previous post