telugu navyamedia
రాజకీయ వార్తలు

అమెరికాలో 60 మందికి కరోనా..భయపడాల్సిన పనిలేదు: ట్రంప్

trump usa

వివిధ దేశాల్లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. అమెరికాలో ఇప్పటి వరకు 60 మందికి కరోనావైరస్ సోకింది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. కరోనా వైరస్ వ్యాప్తి గురించి పెద్దగా భయపడాల్సిందేమీ లేదని అన్నారు. వైరస్ దాడి పెరిగేందుకు కొంతవరకూ అవకాశం ఉందని, కానీ నియంత్రించలేనిదంటూ ఏదీ లేదని పేర్కొన్నారు. అయితే ఇప్పటికే చైనా నుంచి అమెరికాకు రాకపోకలను నిషేధించామని తెలిపారు. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న ఇటలీ, దక్షిణ కొరియాలకూ ఈ ఆంక్షలు పెట్టాలని యోచిస్తున్నామని తెలిపారు.

ఇటీవల అమెరికా హెల్త్ డిపార్ట్ మెంట్ చేసిన సూచనలకు వ్యతిరేకంగా ట్రంప్ కామెంట్లు ఉండటం గమనార్హం. అమెరికాలో ఇప్పటికే 60 మందికి కరోనా సోకిందని, పార్టీలు, జనం ఎక్కువగా గుమిగూడే కార్యక్రమాలు చేపట్టవద్దని యూఎస్ హెల్త్ డిపార్ట్ మెంట్ కొన్ని రోజుల కిందే ప్రకటించింది. ఇప్పటికే చైనాలో 78 వేల మందికిపైగా కరోనా వైరస్ బారినపడగా.. 2,700 మందికిపైగా మరణించారు.

Related posts