telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

ఓటిటి లో విడుదల కానున్న కార్తీ సుల్తాన్…

Karthi

హీరో కార్తీ ప్రస్తుతం సుల్తాన్ అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వంలో రూపిందింది. ఈ సినిమాతో లక్కీ బ్యూటీ రష్మికా తమిళనాట అరంగేట్రం చేయనుంది. ఖైదీ సినిమా తరువాత కార్తీ నుంచి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా థియేటర్లు తెరుచుకున్నప్పటికీ ఓటీటీ పైనే మొగ్గు చూపుతోందిట. అయితే ఓటీటీ లాక్‌డౌన్ సమయంలో ఫిల్మ్ మేకర్స్‌కి ఓటీటీలు ఆశాకిరణాల్లో కనిపించాయి. వీటిలో సినిమా విడుదలైతే సినిమా పరిస్థితి ఏంటరని అందరూ సందేహించారు. అదే సమయంలో సూర్య సినిమా ‘సురారై పోట్రు’ తెలుగులో ఆకాశం నీ హద్దురా విడుదలై అందరికీ షాక్ ఇచ్చింది. ఈ ఏడాది ఓటీటీలో విడుదలైన ఆకాశం నీ హద్దురా సినిమా జాతీయ స్థాయిలో మంచి విజయాన్ని అందుకుంది. ఈ ఏడాది ఎక్కువ మంది వీక్షించిన సినిమాల్లో కూడా రెండో స్థానంలో నిలిచింది. ఇప్పుడు తమ్ముడు కూడా అన్న బాటలో నడిచేందుకు చూస్తున్నాడు. కార్తీ సినిమా సుల్తాన్‌ను ఓటీటీలో విడుదల చేయడం కోసమని డిస్నీ+, హాట్ స్టార్లతో సంప్రదింపులు చేస్తున్నారట. ఈ వార్తతో అందరు విస్తుబోయారు. థియేటర్లు తెరిచాక కూడా కార్తీ ఓటీటీ విడుదల ఏంటని అందరూ సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం ఈ సంక్రాంతికి తమిళనాడులో విడుదలయ్యేందుకు విజయ్ మాస్టర్ సినిమా సహా పెద్ద క్యూనే ఉంది. దాంతో ఈ సినిమాను ఓటీటీలో విడుదల చేయడం మంచిదని చిత్ర యూనిట్ అనుకుంటుందట. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

Related posts