telugu navyamedia
రాజకీయ

భారతీయులకు ర‌క్ష‌ణ‌గా తాలిబన్లు ..!

ఆఫ్ఘనిస్తాన్ లో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అఫ్ఘనిస్తాన్ నుంచి తమ సాయుధ దళాలను ఉపసంహరించగానే తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకోవడం మొదలు పెట్టారు. అధ్యక్షుడు అష్రాఫ్ ఘని దేశం వదలి పారిపోడం, సైన్యం ప్రతికటించకపోవడంతో తాలిబన్లు రాజధాని కాబూల్ ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.

1996 నుంచి 2001 వరకు అఫ్ఘనిస్తాన్ లో తాలిబన్ల పాలన సాగింది . అది ఎంత క్రూరంగా , భయానకంగా ఉంటుందో ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు తెలుసు . అందుకే అలాంటి రాక్షస పాలన పునరావృతం అవుతుందనే ఉద్దే శ్యం తో దేశం విడిచి పోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు . అయితే అప్పటికే దేశం లో అన్ని దారులు మూసివేశారు . ఒక్క కాబూల్ విమానాశ్రయం మాత్రమే అందుబాటులో వుంది. అది అమెరికా దళాల పహారాలో వుంది.

అఫ్ఘనిస్తాన్ లో ఊహించని రాజకీయ పరిణామం తో ఆ దేశంలో వున్న తమ రాయబార .కార్యాలయాలను మూసివేసి అక్కడి ఉద్యోగులను స్వదేశాలకు తరలించాలని ప్రభుత్వాలు నిర్ణయించారు.

ఆఫ్ఘనిస్తాన్ లో ని రాయబార కార్యాలయంలో 150 మంది భారతీయ దౌత్యవేత్తలు మరియు ఉద్యోగులు ఉన్నారు, తాలిబాన్లు రాజధాని కాబూల్ పై తమ పట్టును బిగిస్తున్నారనే వార్తలను చూసి మరింత ఆందోళన చెందుతున్నారు, వీరినదరినీ స్వదేశానికి రప్పించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది .

సోమవారం అర్ధరాత్రి సమయం.కాబూల్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రధాన ఇనుప గేట్ బయట, తాలిబాన్లు మెషిన్ గన్‌లు , రాకెట్ గ్రెనేడ్ లాంచర్‌లతో కాపలాగా వున్నారు . నిజానికి ఆఫ్గనిస్తాన్ లో తాలిబన్ల పాలన ముగిచాక ఏర్పడ్డ ప్రభుత్వానికి భారత ప్రభుత్వం మద్దతు ప్రకటించి , అభివృద్ధిలో అండగా వుంది . పాకిస్తాన్ కు తాలిబన్లకు మైత్రి సంబంధాలు వున్నాయి .

కాబట్టి గతంలో జరిగిన సంఘటనలు దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు తాలిబన్లు భారతీయుల మీద పగతీరుకోవడానికి వచ్చారా ? అక్కడి వాతావరణం చాలా గభీరంగా వుంది. కాసేపటి తరువాత 20 వాహనాలు భారత రాయబార కార్యాలయం దగ్గరకు వచ్చాయి.

దౌత్య వేత్త గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో లోపల వున్న రాయబార కార్యాలయ ఉద్యోగులు భయం భయంగా ఆ వాహనాల్లో ఎక్కారు .ఆ వాహనాలు కాబూల్ విమానాశ్రయం వైపు వెళ్ళేటప్పుడు తాలిబన్లు వారి వైపు చిరునవ్వులు చిందిస్తూ “హ్యాపీ జర్నీ ” అంటూ చేతులు ఊపారు . ఆ వాహనాలకు ఎస్కార్ట్ గా వారు విమానాశ్రయం వరకు వెళ్లారు .

అప్పటికే కాబుల్ విమానాశ్రయంలో ఆగివున్న భారత సైనిక విమానంలోకి వారంతా సురక్షితంగా చేరారు .ఆ విమానంలో ప్రయాణించిన ఏ ఎఫ్ పి వార్తా సంస్థ విలేఖరి ఈ కథనాన్ని వివరించాడు భారత ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య నిజంగా అభినందనీయం .

Related posts