telugu navyamedia
రాజకీయ

ద్రౌపది ముర్ము ఎవరు?.. కౌన్సిలర్ నుండి రాష్ట్రపతి అభ్యర్థి వరకు..

*ఎన్డీయే రాష్ర్ట‌ప‌తి అభ్య‌ర్ధిగా ద్రౌపది ముర్ము

*ఈ నెల 25న రాష్ర్ట‌ప‌తి అభ్య‌ర్ధి ద్రౌపది ముర్ము నామినేష‌న్

ఎన్డీయే రాష్ర్ట‌ప‌తి అభ్య‌ర్ధిగా గిరిజన మహిళ అయిన ద్రౌపది ముర్మును ప్ర‌క‌టించారు.. రాష్ట్రపతి అభ్యర్థి కోసం బీజేపీ పార్లమెంటరీ బోర్డు 20 మంది పేర్లను చర్చించిందని, ఆ తర్వాత తూర్పు భారతదేశానికి చెందిన గిరిజన మహిళను ఎంపిక చేయాలని నిర్ణయించామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు.

ద్రౌపది ముర్ము రాజకీయంగా ఉజ్వల జ్యోతిలా వెలుగుతున్నప్పటికీ.. ద్రౌపది ముర్ము వ్యక్తిగత జీవితం అత్యంత విషాదభరితం. అన్నీ తట్టుకొని నిలడిన ఆమె ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తారు.

అధికార ఎన్డీఏ కూటమి తమ రాష్ట్రపతి అభ్యర్థిగా 64 ఏళ్ల ద్రౌపది ముర్ము పేరును ప్రకటించారు. అన్నీ అనుకూలిస్తే భారతదేశానికి రాష్ట్రపతి అయ్యే తొలి గిరిజన మహిళగా ద్రౌపది చరిత్రసృష్టిస్తారు. అత్యంత పేద కుటుంబంలో పుట్టిన ఆమె 25 ఏళ్ల కెరీర్ లో.. రాజకీయాల్లో కిందిస్థాయి పదవి అయిన కౌన్సిలర్‌ నుంచి అత్యున్నతమైన రాష్ట్రపతి పదవికి పోటీ పడే స్థాయికి ఎదిగారు.

ద్రౌపది ముర్ము 20 జూన్ 1958న ఒడిశాలోని మయూర్‌భంజ్ పశ్చిమ బెంగాల్-జార్ఖండ్ సరిహద్దుల్లో ఉంటుది) జిల్లాలో జన్మించారు. అత్యంత వెనుకబడిన, మారుమూల జిల్లాకు చెందిన ముర్ము, పేదరికం, ఇతర సమస్యలతో పోరాడుతూ.. త‌న జీవితాన్ని సాగించింది. ఆమె ఎన్నో ఆవ‌రోధాల‌ను ఆధిరోయించి.. భువనేశ్వర్‌లోని రమాదేవి మహిళా కళాశాలలో డిగ్రీ చదివారు. ఆర్ట్స్‌ విద్యార్థి అయిన ముర్ము.. సాగునీటి-విద్యుత్తు శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం చేశారు. రాయ్‌రంగాపూర్‌లోని శ్రీ అరబిందో సమీకృత విద్యా కేంద్రంలో స్వచ్ఛందంగా ఉపాధ్యాయురాలిగా పనిచేశారు.

Draupadi Murmu Height, Parents, Husband Name, Age & Income - info Knocks

 

వైవాహిక జీవితం విషాదభరితం

ముర్ము భర్త శ్యాంచరణ్‌ ముర్ము. వీరికి ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. అయితే, ద్రౌపది భర్త శ్యాంచరణ్ తోపాటు ఇద్దరు కుమారులు గతంలోనే చనిపోయారు. భర్త, కొడుకులను కోల్పోయిన ద్రౌపది మిగిలిన ఏకైక కూతురు ఇతిశ్రీనే అన్నీ.. ఇతిశ్రీని.. గణేష్ హెంబ్రామ్‌ను వివాహం చేసుకున్నారు.ఆమెకు ఒక పాప కూడా ఉంది.

కౌన్సిలర్‌గా రాజకీయ జీవితం ప్రారంభం.

చదువుకున్న వ్యక్తిగా తన గిరిజనం బాగు కోసం తపించే ద్రౌపది ముర్ము తొలిసారి బీజేపీ తరఫున 1997లో రాయ్‌రంగ్‌పూర్‌ నగర పంచాయతీ కౌన్సిలర్‌గా ఎన్నికై రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2000 సంవత్సరంలో రాయ్‌రంగ్‌పూర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. బిజూ జనతాదళ్‌ (బీజేడీ), బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో 2000-2004 మధ్య వాణిజ్య, రవాణా, మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఒడిస్సాలో ఉత్తమ పనితీరు కనబరిచే ఎమ్మెల్యేలకు అందించే నీలకంఠ అవార్డును 2007లో అందుకున్నారు. 2004లో రెండోసారి ఎన్నికయ్యారు.

Draupadi Murmu, NDA's candidate for presidential elections, likely to file  nomination on June 25

పార్టీపరంగా బీజేపీ ఒడిస్సా ఎస్టీ మోర్చా ఉపాధ్యక్షురాలు, అధ్యక్షురాలిగా వ్యవహరించారు. 2010, 2013లో రెండుసార్లు మయూర్‌భంజ్‌ పశ్చిమ జిల్లా అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2013లో ముర్మును బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా నియమించారు. మయూర్‌భంజ్‌ పశ్చిమ జిల్లా అధ్యక్షురాలిగా ఉన్నప్పుడే.. 2015 మే 18న జార్ఖండ్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. 2021 జూన్‌ 12 వరకు ఆ పదవిలో కొనసాగారు. జార్ఖండ్‌ రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్‌గా ద్రౌపది ముర్ము చరిత్రకెక్కారు.

ద్రౌపది ముర్ము రాష్ట్ర‌ప‌తిగా ఎన్నికైతే.. తొలి గిరిజన, తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగానే కాక.. స్వాతంత్య్రం తర్వాత జన్మించిన తొలి రాష్ట్రపతి ఈమెనే కానున్నారు. ఇప్పటివరకు భారత రాష్ట్రపతిగా ఎన్నికైన వారంతా 1947కు ముందు జన్మించినవారే.దాదాపు రెండు దశాబ్దాలుగా ఆమె రాజకీయాలు, సామాజిక సేవలో ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికలకు నామినేషన్ల దాఖలుకు చివ‌రి తేదీ జూన్ 29 కాగా, జూలై 18న పోలింగ్ జరుగుతుంది. జూలై 21న ఓట్ల లెక్కింపు జరుగుతుంది.

Related posts