telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు సామాజిక

కోస్తా తీరం గ్రామాల్లో పోలీసుల బందోబస్తు!

kostal port police

ఏపీ ప్రిన్సిపల్ సెక్రెటరీ, హోమ్ శాఖ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని కోస్తా తీరం గ్రామాల్లో ఈ నెల 5 నుంచి 6 వరకు సాగర్ కావాచ్ బందోబస్తుకు ప్రకాశం జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్ ఏర్పాట్లు చేశారు. ఆయా గ్రామాల్లోని బస్టాండ్, రైల్వే స్టేషన్, ముఖ్య కార్యాలయాల్లో నేవీ, కోస్టల్ పోలీసులతో చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేయనున్నారు. అసాంఘిక శక్తులను, తీవ్రవాదులను పట్టుకొనుటకు అవగాహన కల్పించేందుకు మొత్తం 270 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.

ప్రకాశం జిల్లా పోలీసు సిబ్బందితోపాటు కోస్టల్ సెక్యూరిటీ పోలీసు సిబ్బంది కూడా విధులు నిర్వహిస్తున్నారు. సాగర్ కావాచ్ కోస్టల్ సెక్యూరీటీ ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేయనున్నారు. బందోబస్తు నిర్వహిస్తున్న సమయంలో ఈత ముక్కలను, పట్టణంలోని ల్యాండింగ్ ప్రాంతాల్లో బందోబస్తు సక్రమంగా నిర్వహించాలని అపరిచిత వ్యక్తులను విచారించాలని సిబ్బందికి పోలీసు ఉన్నతాధికారులు సూచించారు.

Related posts