telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

దిశ ఘటనకు నేటితో ఏడాది…

Disha

నవంబర్ 27న వెటర్నరీ డాక్టర్‌ దిశ బైక్‌కు పంచర్ చేసి శంషాబాద్ శివారులోని తొండుపల్లి టోల్‌గేట్ సమీపంలో డ్రామా ఆడారు. ఆ తర్వాత ఆమెను బలవంతంగా తీసుకెళ్లి నలుగురు దుర్మార్గులు షాద్ నగర్ వద్ద అత్యాచారానికి ఒడిగట్టి.. కిరాతకంగా సజీవ దహనం చేశారు. ముందు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. మరుసటి రోజే కేసును చేధించారు.. నలుగురు నిందితుల్ని అరెస్ట్ చేశారు. ఈ ఘటన తర్వాత తెలుగు రాష్ట్రాలతో పాటూ దేశవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. నిందితుల్ని కఠినంగా శిక్షించాలంటూ మహిళా సంఘాలు ఆందోళనలు చేశాయి. నలుగురు నిందితుల్ని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి.. రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తీసుకెళ్లారు. వారిని జైలుకు తీసుకెళుతుండగా.. ప్రజలు వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొద్ది రోజులకు నిందితుల్ని తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేయగా.. కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ తర్వాత నలుగురు నిందితుల్ని సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేసేందుకు తీసుకెళ్లగా.. వారు ఎదురు తిరిగి పోలీసులుపై దాడికి దిగడంతో ఎన్‌కౌంటర్ చేయాల్సి వచ్చింది. పోలీసుల కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. తర్వాత ఈ ఎన్‌కౌంటర్‌పై మానవహక్కుల సంఘం విచారణ.. ఆ వెంటనే సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ కేసు విచారణ కొనసాగుతోంది..

Related posts