telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు వార్తలు

పోలీస్ అకాడమీలో మిస్ ఫైర్..ఇన్స్ పెక్టర్ కు గాయాలు

gun fire

తెలంగాణ పోలీస్ అకాడమీలో ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాదులో ఈ ఉదయం ట్రైనీ ఎస్సైలు శిక్షణలో ఉన్న సమయంలో ప్రమాదం సంభవించింది. షూటింగ్ కు సంబంధించిన ట్రైనింగ్ జరుగుతున్న సమయంలో… ఓ మహిళా ఎస్సై వాడుతున్న తుపాకీ పేలలేదు.

దీంతో ఆ తుపాకీని పక్కనే ఉన్న ఇన్స్ పెక్టర్ వినోద్ దగ్గరకు ఆమె తీసుకెళ్లారు. తుపాకీని సరిచేస్తున్న సమయంలో దాన్నుంచి తూటా దూసుకొచ్చింది. ఆయన తొడ భాగం గుండా దూసుకెళ్లి, బయటకు వచ్చింది. గాయపడిన వినోద్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

Related posts