నేడు డల్లాస్ లో ఏపీసీఎం జగన్ అమెరికా పర్యటనలో భాగంగా తెలుగు ఎన్నారైల సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తన ఆనందాన్ని ట్విట్టర్ లో పంచుకున్నారు. తన పట్ల తెలుగు వాళ్లు చూపించిన ప్రేమాభిమానాలు ముగ్ధుడ్ని చేశాయని పేర్కొన్నారు. డల్లాస్ లో అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తానని వినమ్రంగా తెలిపారు. తెలుగు వాళ్లలో కనిపించిన ఉత్సాహం, ఉత్సుకత అమోఘం అని జగన్ తన ట్వీట్ లో వివరించారు. తన పట్ల చూపిన విశేష ఆదరణకు ఆయన కృతజ్ఞతలు తెలుపుకున్నారు.
ఈ సభలో ఏపీసీఎం జగన్ మాట్లాడుతూ, తెలుగు ఎన్నారై లు ఎవరైనా కనీసంలో కనీసం రెండు సార్లైనా సొంత ఊళ్లకు వచ్చి బందువులతో గడపాలని ఆహ్వానించారు. ఆయా ప్రాంతాలలో నివసించే వారు తమ సొంత ఊళ్లలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలన్నా ప్రభుత్వ పోర్టల్ ద్వారా సులభంగా చేయవచ్చని సూచించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలనే వారికి అత్యంత సులభమైన మార్గదర్శకాలతో ఏపీసీఎం కార్యాలయం స్వయంగా సిద్ధంగా ఉందని చెప్పారు. తెలుగు రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నాడని, తదనుగుణంగా అభివృద్ధిలో రాష్ట్రాన్ని పరుగులు పెట్టించాలని జగన్ పిలుపునిచ్చారు.
రాహుల్, లోకేశ్ లా కేటీఆర్ అసమర్థుడు కాదు: మంత్రి ఎర్రబెల్లి