telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

తిరుపతిలో  స్వచ్చంద లాక్ డౌన్ !

lockdown hyd

తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయం లో ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి,నగరపాలక సంస్థ కమిషనర్ పీఎస్ గిరీషా, మేయర్ శిరీష, ఎస్పీ వెంకట అప్పల నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యాపార సంఘాలు, మార్కెట్ వ్యాపారులు, ఆటో డ్రైవర్ల తో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ.. తిరుపతిలో రేపటి నుంచి మధ్యాహ్నం 2గంటల తర్వాత స్వచ్చంధంగా దుకాణాల మూసివేయనున్నారని తెలిపారు. దుకాణాలు స్వచ్చంధంగా మూసుసేందుకు ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. తిరుపతి మార్కెట్ ను నగరంలో 7,8 చోట్ల డీ సెంట్రలైజ్ చేస్తున్నామని.. రాయలసీమ లోనే అతి పెద్ద జాతర తిరుపతి గంగమ్మ జాతర ఏకాంతంగా జరిపేందుకు నిర్ణయం
తీసుకున్నట్లు ప్రకటించారు. ఆటోల్లో, జీపుల్లో పరిమిత సంఖ్య లోనే ప్రయాణికులను ఎక్కించుకునేందుకు డ్రైవర్ల యూనియన్ స్వచ్చంధ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. వాక్సిన్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నామని తెలిపారు.

Related posts