telugu navyamedia
రాజకీయ

దేశ ప్ర‌జ‌ల‌కు రాష్ట్రపతి, ప్రధాని క్రిస్మస్ శుభాకాంక్షలు

దేశ వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలను భక్తులు ఘనంగా నిర్వహించుకున్నారు. అర్థరాత్రి నుంచే కరోనా నిబంధనలు పాటిస్తూ చర్చిల్లో ప్రార్థనలు జరుపుకున్నారు. ఈ సంద‌ర్భంగా దేశ ప్ర‌జ‌ల‌కు రాష్ట్రపతి రాష్ట్రపతి, ప్రధాని నరేంద్ర మోదీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.

కొన్ని రాష్ట్రాల్లో ఒమిక్రాన్ ప్రభావం ఉండటంతో అక్కడి ప్రభుత్వాలు సామూహిక ప్రార్థనలకు అనుమతి ఇవ్వలేదు. కానీ కొన్ని రాష్ట్రాలు నిబంధనలతో కూడిన వేడుకలకు అనుమతినిచ్చాయి.

President Kovind turns 76 today; PM Modi, other leaders extend greetings -  BusinessToday

దేశ, విదేశీ ప్రజలకు, క్రిస్టియన్​ అన్నదమమ్ములకు, అక్కచెల్లెలకు శుభాకాంక్షలు. జీసస్ కోరుకున్న విధంగా న్యాయంతో, స్వేచ్ఛగా ఉండే సమాజాన్ని నిర్మిచాలని మనం ప్రతిజ్ఞ తీసుకుందాం.” అని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ట్వీట్ చేశారు.

అందరికి క్రిస్మస్​ శుభాకాంక్షలు. సమాజసేవ, మానవత్వం కోసం క్రీస్తు చెప్పిన మాటలను ఈ సందర్భంగా గుర్తుచేసుకుందాం. అందరు ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. సమాజం సామరస్యంతో వర్థిల్లాలని కోరుకుంటున్నాను.” అని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

Related posts