telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

ట్రాఫిక్ పోలీసులకు .. సమ్మర్ కిట్ లు .. చల్లచల్లగా..

summer kits to traffic police by telangana govt

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో మండు వేసవిని దృష్టిలో పెట్టుకుని విధులు నిర్వర్తించే ట్రాఫిక్ పోలీసులకు సమ్మర్ కిట్లు అందజేశారు. భానుడి భగభగలను తట్టుకుంటూనే రోడ్లపై నిలుచుని విధులు నిర్వర్తించాల్సిన ట్రాఫిక్ పోలీసుల రిలీఫ్ కోసం ఈ కిట్లు ఉపయోపడతాయని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

ఈ కిట్ లో మంచినీళ్ల సీసా, మజ్జిగ ప్యాకెట్, కాలర్ లైట్, చలువ కళ్లద్దాలు, ముక్కుకు ధరించే మాస్క్, రిఫ్లెక్టివ్ జాకెట్, గ్లూకోన్-డి ప్యాకెట్, కూలింగ్ వెస్ట్ ఉంటాయి. మొత్తం 2,400 మంది ట్రాఫిక్ పోలీసులకు ఈ సమ్మర్ కిట్లు పంపిణీ చేశారు.

Related posts