telugu navyamedia
సినిమా వార్తలు

సల్మాన్ తో ‘నాటు’ స్టెప్స్ వేయించిన చరణ్, ఎన్టీఆర్..

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్​చరణ్ , యంగ్ టైగ‌ర్‌ ఎన్టీఆర్ హీరోలుగా ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన సినిమా ‘ఆర్ఆర్ఆర్‌.

ఇందులో రామ్​చరణ్, అల్లూరి సీతారామరాజుగా.. ఎన్టీఆర్ కొమరం భీమ్​గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టించారు.అజయ్ దేవ్​గణ్, సముద్రఖని, శ్రియ కీలకపాత్రలు పోషించారు.

Bigg Boss 15: Salman Khan celebrates pre-birthday bash with 'RRR' team Alia Bhatt, Ram Charan, Jr NTR | Tv News – India TV

జనవరి 7,2022న ఆర్ ఆర్ ఆర్ చిత్రం రిలీజ్ కాబోతుంది. నేపథ్యంలోనే ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు మేకర్స్. నేపథ్యంలోనే నేషనల్​ వైడ్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు మేకర్స్.

అందులో భాగంగానే హిందీలో సల్మాన్​ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘బిగ్​బాస్ 15​’ షోకు అతిథులుగా వెళ్లారు ఎన్టీఆర్​, రామ్ చరణ్, ఆలియా భట్, దర్శకుడు రాజమౌళి.

RRR movie

ఈ స్పెషల్ ఎపిసోడ్ ప్రోమోలో అలియా భట్ తెలుగులో కొన్ని మాటలు మాట్లాడుతూ కనిపించారు. అంతేకాదు హోస్ట్ సల్మాన్ ఖాన్‌కి రామ్ చరణ్, తారక్ ఫేమస్ నాచో నాచో స్టెప్ నేర్పించారు.

‘బిగ్​బాస్’​ వేదికపై ‘నాటు నాటు’ (హిందీలో ‘నాచో నాచో’) పాటకు మూవీ టీమ్​తో కలిసి స్టెప్పులేశారు సల్మాన్. ఈ కార్యక్రమం శనివారం రాత్రి 9.30 గంటలకు ప్రసారంకానుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Related posts