telugu navyamedia
సినిమా వార్తలు

దగ్గుబాటి రానా తో భీమ్లా నాయక్ సినిమా చూసిన పవన్

  • సాగర కే చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్
  • పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్ర యూనిట్ తో కలిసి చూశారు..
  • భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరో హీరో గా దగ్గుబాటి రానా నటిస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం భీమ్లా నాయక్. నిత్యమీనన్, సంయుక్త మీనన్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

ఫిబ్రవరి 25 కానీ,ఏప్రిల్ 1న కానీ ఈ సినిమా రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్. ఈ నేపథ్యంలోనే ఫైనల్ అవుట్ పుట్ ను ప్రసాద్ ల్యాబ్ లో బుధవారం
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్ర యూనిట్ తో కలిసి చూశారు..

ఇక ఈ సినిమా తోపాటు హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్, సినిమాలు చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు.

నిజానికి ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వివిధ కారణాలతో వాయిదా పడింది.

Related posts