telugu navyamedia
ఆంధ్ర వార్తలు

హైదరాబాద్ రానున్న మోదీని ఖచ్చితంగా ఆహ్వానిస్తా.

modi with kcr

కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై సీఎం కేసీఆర్ తీవ్రంగా మండిపడ్డారు.

బీజేపీ ప్రభుత్వ విధానాలపై మండిపడ్డ సీఎం కేసీఆర్ ఫిబ్రవరి 5న హైదరాబాద్ రానున్న పీఎం మోదీని ఖచ్చితంగా ఆహ్వానిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. ముచ్చింతల్‌లో ఏర్పాటు చేసిన శ్రీ రామానుజా చార్యులు విగ్రహా ఆవిష్కరణనకు ప్రధాని మోదీ రానున్నారు. పీఎం మోదీపై తీవ్రంగా మండిపడ్డ సీఎం కేసీఆర్ …. ఇది ప్రభుత్వ పాలసీ వేరు, ప్రోటోకాల్ వేరంటూ వివరించారు. కాగా ఈ క్రమంలోనే మోదీని సీఎం కేసీఆర్ కలుస్తారా లేదా అనే మీమాంసకు సీఎం తెరతీశారు. ప్రొటోకాల్ ప్రకారం మోదీని రిసీవ్ చేసుకుంటామని చెప్పారు.

పీఎం మోదీపై సీఎం కేసీఆర్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. గత ఏడు సంవత్సరాలుగా పీఎం మోదీ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.

బీజేపీ పాలన అంటే, దేశ ఆస్తులను అమ్మడం, మతపిచ్చి లేపడం , మందిమీద పడి ఏడ్వడమే బీజేపీ లక్ష్యమని అన్నారు. పీఎం మోదీ సిగ్గు లేకుండా సొంత డబ్బా కొట్టుకుంటున్నారని అన్నారు.

Related posts