కడప జిల్లాలో ఘోర పేలుడు సంభవించింది. ముగ్గురాయి క్రషర్ వద్ద పేలుడు పదార్థాలు పేలి సుమారు 10 మంది క్వారీ కూలీలు మృతి చెందారు. ఆ జిల్లాలోని పొరుమామిళ్ల మండలం మామిల్లపల్లె వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. క్వారీలో ముగ్గురాయి వెలికితీత పనులకు వెళ్లిన కూలీలు…వెలికితీత సమయంలో ఒక్కసారిగా పేలుడు పదార్థాలు పేలాయి. దీంతో అక్కడికక్కడే 10 10 మంది క్వారీ కూలీలు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. విషయం తెలియగానే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు….క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు.
previous post
next post