telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“ఆర్ఆర్ఆర్” టీం అలియా కోసం మరో రెండు వారలు ఆగాల్సిందే…!

Alia

ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా రూపొందుతున్న భారీ మల్టీస్టారర్ “‘రౌద్రం రణం రుధిరం”. ఇందులో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. టాలీవుడ్ స్టార్స్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇందులో సీత పాత్రలో రామ్‌‌చరణ్‌కు జోడీగా ఆలియా నటిస్తోంది. అలాగే ఎన్టీఆర్ సరసన బ్రిటీష్ భామ పాత్రలో హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్ నటిస్తుంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ ను తిరిగి మొదలు పెట్టాడు జక్కన్న. ఇప్పటికే విడుదలైన అల్లూరి, భీమ్ టీజర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి కీలక పోరాట సన్నివేశాలను హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్నారు. సీత పాత్రలో నటించనున్న బాలీవుడ్ నటి ఆలియా భట్ నవంబర్ తొలి వారంలోనే సెట్లో అడుగుపెడుతుందని యూనిట్ ప్రకటించింది. అయితే ఇప్పుడామె రాక మరింత ఆలస్యం కానున్నట్లు తెలుస్తోంది. ఆలియా ప్రస్తుతం సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో ‘గంగూబాయ్‌ కథియావాడి’ చిత్రంలో నటిస్తోంది. ముంబయిలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నవంబర్ తొలి వారంలోనే ముగియాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఆ షెడ్యూల్‌ను మరో రెండు వారాలు పొడిగించారట భన్సాలీ. ఈ కారణంగా ఆలియా ‘ఆర్ఆర్ఆర్’ టీమ్‌తో జాయిన్ కావడానికి ఆలస్యమవుతోందని తెలుస్తోంది.

Related posts