telugu navyamedia
సినిమా వార్తలు

బుచ్చిబాబు-ఎన్టీఆర్ సినిమా కు మ్యూజిక్ ఏ ఆర్ రెహమాన్ ?

బుచ్చిబాబు సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుంది.

ఈ సినిమా కి ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించబోతున్నారట.
ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన ఎక్కడా రాలేదు. కానీ టాక్ మాత్రం నడుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు మంచి లైనప్ ని ఏర్పాటు చేసుకుంటున్నారు. అందులో ఎన్టీఆర్ కూడా ఉన్నారు. ఎన్టీఆర్ నటించిన ఆర్ ఆర్ ఆర్ చిత్రం మార్చి 25న రిలీజ్ కాబోతోంది. అయితే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ, ప్రశాంత్ నీల్, బుచ్చిబాబు వంటి దర్శకులను లైన్ లో పెట్టారు.

ఇక బుచ్చిబాబు తన మొదటి చిత్రం ఉప్పెన తో మంచి హిట్ ని అందుకున్నాడు. సుకుమార్ శిష్యుడుగా ఇండస్ట్రీకి పరిచయమైన బుచ్చిబాబు రెండో సినిమాను ఎన్టీఆర్ తో ప్రకటించడం పట్ల అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

Related posts