telugu navyamedia
సినిమా వార్తలు

సినిమా థియేట‌ర్‌ కంటే కిరాణా కొట్టే బెట‌ర్‌..!

నేచురల్ స్టార్ నాని న‌టించిన సినిమా ‘శ్యామ్ సింగ రాయ్’ . రేపు (డిసెంబర్ 24న ) రిలీజ్ కు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నాని ఏపీ టికెట్ రేట్ల విషయంపై తీవ్ర అసహనం తెలియజేశారు.

Nani's Shyam Singha Roy Is Universally Acceptable As It Completed The  Censor Certification

ఏపీ ప్రభుత్వం టికెట్‌ ధరలు తగ్గించి ప్రేక్షకులను అవమానించిందని నేచురల్ స్టార్ నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఏపీలో టిక్కెట్ల విషయమై ఏం జరుగుతుందో అది కరెక్ట్ కాదని మనందరికీ తెలుసు.

10 మందికి ఉద్యోగం ఇచ్చే థియేటర్​ కంటే పక్కనే ఉన్న కిరాణా కొట్టు కలెక్షన్ ఎక్కువగా ఉంటోంది. టికెట్ ధరలు పెంచినా.. కొని సినిమా చూసే సామర్థ్యం ప్రేక్షకులకు ఉంది.”

ఇప్పటికీ చూస్తున్న టికెట్ రేట్స్ రూ.10, రూ.15, రూ. 20 అని…  మళ్ళీ ఇది అనవసరంగా ఏ థంబ్ నెయిల్స్ పెడతారో ..ఇప్పుడు ఏది మాట్లాడినా వివాదమే అవుతుంది… రేపు అసలు సినిమా రిలీజ్ కూడా ఉందని సెటైర్లు వేశారు.

Rise of Shyam: The first lyrical song from Nani's 'Shyam Singha Roy' to be  unveiled on this date | Telugu Movie News - Times of India

అలాగే 10 మందికి ఉద్యోగాలు ఇచ్చి థియేటర్లు నడుపుతున్న ఒక వ్యక్తి కౌంటర్ కంటే పక్కనే ఉన్న కిరాణా షాప్ కౌంటర్ ఎక్కువగా ఉంటే కరెక్ట్ కాదు… నా చిన్నప్పుడు స్కూల్లో అందరం పిక్నిక్ కు వెళ్లేవాళ్లం… ఆ టైంలో అందరి దగ్గరా రూ.100 అడిగేవారు. అయితే అదే సమయంలో అందరూ రూ.100 ఇవ్వగలరు… నాని నువ్వు మాత్రం ఇవ్వలేవు… నువ్వు రూ. 0 ఇస్తే చాలు అంటే అది నన్ను ఇన్సల్ట్ చేసినట్టే…” అంటూ చెప్పుకు రావడం సంచలనంగా మారింది.

కాగా.. ప్రభుత్వం సినిమాటోగ్రఫీ చట్టం లో చాలా మార్పులు చేయడం జరిగింది. బెనిఫిట్ షోల రద్దు, ఆన్లైన్ ద్వారా టికెట్స్ అమ్మకాలు, ధరల తగ్గింపు వంటి కీలక మార్పులు పొందుపరిచారు. ప్రాంతం, థియేటర్ స్థాయి ఆధారంగా రేట్లు నిర్ణయించడం జరిగింది. దీని ప్రకారం సెమీ అర్బన్, రూరల్ ఏరియాల్లో టికెట్ కనిష్ట ధర రూ. 5 గా నిర్ణయించారు.

Shyam Singha Roy Title Song out: Nani and Sai Pallavi-starrer is a powerful  number

అయితే దీనిపై పలుమార్లు టాలీవుడ్ పెద్దలు, కొంతమంది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను రద్దు చేయాలని కోరారు. ఏపీ టికెట్ రేట్లపై ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 35పై కొందరు థియేట‌ర్ యాజ‌మాన్యులు హైకోర్టుకు వెళ్లగా అక్కడ కొంత ఊరట లభించింది. అయినా ప్రభుత్వం సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజనల్ బెంచిలో అప్పీల్ కు వెళ్లింది.

Related posts