telugu navyamedia
సినిమా వార్తలు

బిగ్ బాస్ చరిత్రలో స‌ల్లూ భాయ్ ఓ సంచ‌ల‌నం..

ఇండియాలో ఎన్ని రియాలిటీ షోస్ ఉన్నా .. ఏ భాష‌లో అయిన బిగ్‌బాస్ ఉండే క్రేజ్ ప్ర‌త్యేక చెప్ప‌న‌వ‌స‌రం లేదు . ఈ బిగ్‌బాస్ షో మొట్ట‌మొద‌ట‌గా హిందీ భాషలో ప్రారంభించబడింది. ఆ త‌రువాత‌ కన్నడ, బెంగాలీ, తమిళం, తెలుగు, మరాఠీ మరియు మలయాళంతో సహా భారతదేశంలో ఏడు భాషల్లోకి ఈ షో వ్యాపించింది.

Salman Khan's 'Bigg Boss 10': Celebs to Be Pitted Against Commoners - Watch Promo | Television | indiawest.com

ఇండియాలో ఎన్ని రియాలిటీ షోస్ ఉన్నా .. బిగ్ బాస్ కి దేశవ్యాప్తంగా ఉండే క్రేజ్ వేరు. హిందీలో అత్యంత సక్సెస్ ఫుల్ షోగా 15 సీజన్స్ ని కంప్లీట్ చేసుకుంది. అమితాబ్ కౌన్ బనేగా క్రోర్‌పతి కూడా బిగ్ బాస్ టీఆర్పీస్ ముందు తక్కువే. హిందీలో ఇంత సక్సెస్ అవ్వడానికి ముఖ్య కారణం సల్మాన్ ఖాన్ హోస్టింగ్ అంటుంటారు.

ఇంటర్నేషనల్ స్థాయిలో సల్మాన్ క్రేజ్, సెన్స్ ఆఫ్ హ్యూమర్, గేమ్ ని నడిపించే తీరు హిందీ బిగ్ బాస్ విజయానికి ముఖ్య కారణం. అలాంటి సల్మాన్ ఖాన్ ఇప్పుడు బిగ్ బాస్ చరిత్రలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుని ఆల్ టైం రికార్డ్ సెట్ చేయబోతున్నాడు.

బిగ్‌బాస్‌ 4వ సీజన్‌ నుంచి ఇప్పుడు రావోతున్న15వ సీజన్‌ వరకు కూడా సల్మానే హోస్ట్. అయితే అక్టోబర్ లో మొదలవనున్న బిగ్ బాస్ సీజన్ 15కి సల్మాన్ ఏకంగా రూ.350 కోట్ల రెమ్యునరేషన్‌ తీసుకోనున్నాడని బీ టౌన్ లో క్రేజీ వార్త‌ ఒకటి సోష‌ల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దాదాపు 14 వారాలపాటు కొనసాగే ఈ సీజన్ 15 కోసం షో నిర్వాహకులు సల్మాన్‌కు ఈ ఆఫర్ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తోంది.

Salman Khan to host Bigg Boss 15 for 350 crores - Lahore Herald

అంటే వారానికి రూ.25 కోట్లు చొప్పున రెండు రోజుల షూటింగ్ కి అనమాట. అయితే డేట్స్ క్లాష్ అవుతుండటంతో సీజన్ 15కి హోస్టింగ్ చేయలేనని సల్మాన్ చెప్పటంతోనే కండలవీరుడికి ఈ క్రేజీ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. ఈ ఆఫర్ బిగ్ బాస్ చరిత్రలోనే పెద్దదని అంటున్నారు. నాల్గవ సీజన్ లో మొదటిసారి హోస్టింగ్ చేసినప్పుడు వారానికి 2.5 కోట్లు తీసుకున్న సల్మాన్ ఇప్పుడు 25కోట్లకి రెమ్యునరేషన్ పెరిగిపోయింది. అంతే 11ఏళ్ళల్లో రెమ్యునరేషన్ ఏకంగా పదింతలు పెరగటం గ‌మ‌న్హారం.

Bigg Boss 13 gets five-week extension, Salman Khan to get Rs 2 crore extra per episode: reports - Hindustan Times

Related posts