telugu navyamedia
సినిమా వార్తలు

బాలయ్య తో దిల్ రాజు సినిమా… టైటిల్ ఇదే…?

no more movies in near future by balakrishna

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బాలయ్య, కే.యస్. రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా తర్వాత బాలయ్య “పింక్” సినిమా తెలుగు రీమేక్‌కు ఓకే చెప్పినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు, బాలయ్యతో ఎప్పటినుండో ఓ సినిమా తీయాలని అనుకుంటున్నాడు. అందులో భాగంగా చాలా కథలు అనుకున్నా కుదరలేదు. చాలా ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఈ కథ ఓకే అయ్యిందని అంటున్నారు. హిందీలో “పింక్” చిత్రంలో అమితాబ్ నటించారు. ఈ “పింక్” సినిమా అయితే బాలయ్యకు బాగుంటుందని భావించిన దిల్ రాజు, బాలయ్యకు దీని గురించి చెప్పగా ఆయన కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. అయితే “పింక్” వంటి సబ్జెక్ట్ బాలయ్య వంటి మాస్ హీరోకు సూట్ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే “పింక్” సినిమాను తమిళంలో అజిత్ హీరోగా “నెర్కొండ పార్వాయి” పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల 10న ఈ సినిమా రిలీజ్ కానుంది. అది అలా ఉండగా ‘పింక్’ తెలుగు సినిమా రీమేక్ రైట్స్‌ను దిల్ రాజు మంచి రేటుకే దక్కించుకున్నాడని తెలుస్తోంది. ఈ మూవీకి “లాయర్ సాబ్” అనే టైటిల్‌ను కూడాపరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ “లాయర్ సాబ్” సినిమాను దివంగత నటి శ్రీదేవి భర్త బోనీ కపూర్ నిర్మాణ భాగస్వామ్యంతో తెలుగులో నిర్మించాలని దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నాడట. అయితే ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వెలువడే వరకు వేచి చూడాల్సిందే.

Related posts