కేజీ కోడి స్కిన్ లెస్ 30.. బొచ్చుతో అయితే అందులో సగం ఇచ్చినా చాలు’.. ఇదీ వారం ముందు చికెన్ కొట్లు వద్ద ఉన్న సీన్. కొందరైతే బేరాల్లేక ఫ్రీగా పంచేశారు. కాని వారం తిరిగే సరికి కేజీ రూ. 200-250 వరకూ అమ్మేశారు. కరోనా కాలంలో చికెన్ తినాలంటే చుక్కలు కనిపిస్తున్నాయి. ఎక్కడా కూడా కిలో చికెన్ బ్రాయిలర్ రూ. 200 తక్కువ లేదు. ఫారిన్ అయితే రూ. 150 వరకూ అమ్మేస్తున్నారు. నిన్న ఆదివారం కావడంతో వీపరీతంగా కోడిమాంసం విక్రయాలు జరిగాయి. చికెన్ కొట్లు వద్ద జనం బారులు తీరారు. మరో పక్క కేసీఆర్, కేటీఆర్‌లు చికెన్ వల్ల కరోనా రాదు అంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు. ఇంకా చెప్పాలి అంటే చికెన్‌లో ఇమ్యునిటీ పవర్ ఎక్కువ గుడ్లు, కోళ్లు గట్టిగా పీకిపారేయండని కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణలోనూ పౌల్ట్రీ తీవ్రంగా నష్టపోవడంతో మంత్రి కేటీఆర్ స్వయంగా చికెన్ మేళాలో పాల్గొని చికెన్ తినడం వల్ల ఎలాంటి నష్టం జరగదని మా కుటుంబంలో రోజు చికెన్ తింటామని చెప్పారు. రాష్టంలో అతిపెద్ద పౌల్ట్రీ పరిశ్రమలు ఉన్న బండ్ల గణేష్ ఇటీవల ప్రెస్ మీట్‌లో కేసీఆర్ చికెన్ గురించి మాట్లాడుతూ అందరూ చికెన్ తినండి అని పిలుపు నివ్వడంతో.. ‘మాటల్లేవ్ మాట్లాడుకోవడాల్లేవ్ మీ సహాయానికి పరమేశ్వర పౌల్ట్రీ ఫార్మ్స్ బండ్ల గణేష్ శతకోటి దండాలు’ అంటూ కేసీఆర్‌కి థాంక్స్ చెప్తూ ట్వీట్ చేశారు. చికెన్ రేటు పెరిగింది కదా.. టెన్షన్ పడకు బ్రో. డొనాల్డ్ ట్రంప్ నీ క్లోజ్ ఫ్రండే కదా.. కేఎఫ్‌సీకి బదులు నీ కోళ్ల ఫార్మ్‌ని ప్రమోట్ చేయమని చెప్పు. అయినా కోళ్లను చంపడానికే కదా నువ్ అమ్మేది.. మళ్లీ వాటికి ఆ కిస్‌లు పెడుతూ షో చేస్తున్నావ్ ఎందుకు బండ్లా.. ఓ పని చేయి బండ్లా ఓ కోటీ రూపాయిలు కరోనా నియంత్రణకు డొనేష్ చేయి నీ సమస్య పరిష్కారం అయిపోతుంది అంటూ బండ్ల గణేష్‌ను ఆడుకుంటున్నారు నెటిజన్లు. దీంతో బండ్ల గణేష్ కోడి ముద్దు ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియలో వైరల్ అవుతుంది.
మా పరిస్థితి ముందుకేల్తే గొయ్యి వెనుకకి వెళ్తే నుయ్యి లా ఉంది కోట్లు పెట్టుబడి పెట్టారము భయంగా వుంది దీయబ్బ కరోనా 😷👹😈💀☠️ pic.twitter.com/mG9HjMxgTw
— BANDLA GANESH (@ganeshbandla) March 30, 2020