telugu navyamedia
సినిమా వార్తలు

మహేష్ 26వ సినిమా టైటిల్ టీజర్

Sarileru-Nikevvaru

ఇటీవ‌ల మహేష్ నటించిన “మ‌హ‌ర్షి” సినిమా ఘ‌న విజ‌యం అందుకున్న విషయం తెలిసిందే. సూప‌ర్‌స్టార్ మ‌హేష్ బాబు ప్ర‌స్తుతం త‌న త‌ర్వాతి సినిమా ప‌నుల‌తో బిజీగా ఉన్నారు. సంక్రాంతికి “ఎఫ్‌-2″తో ఘ‌న‌విజ‌యాన్ని అందుకున్న ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడితో తన 26వ సినిమా చేయ‌బోతున్నారు. అనిల్ సుంక‌ర‌, దిల్ రాజు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మ‌హేష్ తండ్రి, సూప‌ర్‌స్టార్ కృష్ణ జ‌న్మ‌దినోత్స‌వం సంద‌ర్భంగా ఈరోజు (శుక్ర‌వారం) ఆ సినిమా టైటిల్‌ను విడుద‌ల చేశారు. ఈ సినిమాకు “స‌రిలేరు నీకెవ్వ‌రూ” అనే టైటిల్ ను ఖరారు చేశారు. టైటిల్ చివ‌ర్లో తుపాకీ, దానిపై సైనికులు ధ‌రించే టోపీ చూస్తుంటే ఈ సినిమా ఆర్మీ నేప‌థ్యంలో తెర‌కెక్క‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు దేవిశ్రీప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. ఈరోజు ఈ సినిమా షూటింగ్ లాంఛ‌నంగా ప్రారంభమైంది.

Related posts