telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఈ ఎమ్ ఐ కట్టేయడమే బెటర్

rbi

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ RBI మారటోరియం గురించి ప్రకటించి ప్రైవేట్ ఉద్యోగులు, లోన్ లు తీసుకున్న వారి పాలిట శుభవార్త వినిపించారు. కానీ, దానికి ఉన్న కండిషన్స్ అప్లై గురించి తెలుసుకోకపోతే భారీగానే నష్టపోతాం. ఉదహరణకు హోం లోన్ లేదా క్రెడిట్ కార్డు బిల్లు ఏప్రిల్ 5నాటికి లక్ట కట్టాల్సి ఉంటే ఆ రోజు చెల్లించలేదు. అప్పుడు అసలు + వడ్డీరేటును బట్టి మే5న బిల్లులో వస్తుంది. అప్పటికీ కట్టకపోతే (అసలు+వడ్డీరేటు) వడ్డీ జూన్ 5 బిల్లులో వస్తుంది. ప్రస్తుత మారటోరియం ప్రకటన ఫలితంగా వీటిని మాత్రమే మినహాయిస్తారు. కానీ, 20నెలల్లో కట్టాల్సిన ఈఎమ్ఐలు 23నెలల్లో కచ్చితంగా కట్టాల్సిందే. ఇలా చేస్తే క్రెడిట్ స్కోరుపై ప్రభావం కనిపించే అవకాశం ఉంది. అలా కాకుండా క్రెడిట్ కార్డుపై పూర్తి బిల్లు కాకుండా మినిమం పేమెంట్ చేయగలిగితే క్రెడిట్ స్కోరుపై ఎటువంటి ప్రభావం ఉండదు. ఇండస్ట్రీ అంచనాల ప్రకారం.. క్రెడిట్ కార్డు కంపెనీలు చక్రవడ్డీ రేటు 36నుంచి 42శాతం మధ్య వసూలు చేస్తాయి. దాంతో పాటు క్రెడిట్ కార్డు వడ్డీపై 18శాతం జీఎస్టీ కూడా పడుతుంది. క్రెడ్ అనే క్రెడిట్ కార్డ్ పేమెంట్ యాప్ సీఈఓ కునాల్ షా సాధ్యమైనంత వరకూ పూర్తి పేమెంట్ చేయడమే బెటర్ అని సూచిస్తున్నారు.

Related posts