telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సిక్స్ ప్యాక్ సాధించిన హీరోయిన్… ఏ సినిమా కోసమంటే…!

Halle

హాలీవుడ్‌ యాక్షన్‌ స్టార్‌ హాలీ బెర్రీ తన సోషల్ మీడియా పేజ్‌లో ఆసక్తికర ట్వీట్ చేశారు. “ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాని సాధించటం కన్నా గొప్ప ఫీలింగ్‌ ఏది ఉండదు. త్వరలో సెట్స్‌ మీదకు వెళ్లనున్న నా బ్రూజ్‌ మూవీ కోసం నేను సెట్ చేసుకున్ గోల్‌ సిక్స్‌ ప్యాక్‌ యాబ్స్‌ సాధించటం. ఈ రోజు నా గోల్ రీచ్‌ అయ్యాను. ఈ విషయం నేనే నమ్మలేకపోతున్నా” అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు 53 ఏళ్ల హాలీ బెర్రీ. తన సిక్స్‌ ప్యాక్‌ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో ట్వీట్ చేసిన హాలీ బెరీ అందరూ తనలా గోల్స్‌ సెట్‌ చేసుకొని వాటిని సాధించాలని సూచించారు. “మీ ఫిట్‌నెస్‌ గోల్‌ ఏంటి..? మీరు అనుకున్న దానికన్నా ఉన్నతమైన గోల్ సెట్ చేసుకోండి. మీ గోల్‌ను కామెంట్స్‌ ద్వారా తెలిపి వాటిని సాధించేందుకు కష్టపడండి. అది సాధించటం కష్టం కాదు. కానీ మీ కష్టానికి తప్పకుండా ఫలితం ఉంటుంది” అంటూ కామెంట్ చేసింది. బాండ్‌ గర్ల్‌గా ఫేమస్‌ అయి హాలీ బెర్రీ అకాడమీ అవార్డును సైతం సాధించింది. సినిమాలతో పాటు టెలివిజన్‌ షోస్‌లో కూడా కనిపించింది. నటిగానే కాక నిర్మాతగాను పలు చిత్రాలను, టీవీ కార్యాక్రమాలను నిర్మించింది. త్వరలో తన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న బ్రూయిజ్డ్‌ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె సిక్స్‌ ప్యాక్‌లో కనిపించనుంది.

Related posts