telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

సీఎం..సీఎం అంటూ ఫ్యాన్స్‌ అరుపులు.. ఎన్టీఆర్‌ రియాక్షన్‌ ఏంటంటే ?

జూనియర్‌ ఎన్టీఆర్‌…తన అద్భుతమైన నటనతో అందరినీ ఆకట్టుకుంటాడు. అంతేకాదు ఎన్టీఆర్‌కు ఉన్న క్రేజ్‌… టాలీవుడ్‌ పరిశ్రమలో ఎవరికీ లేదంటే అతిశయోక్తిలేదు. ఎన్టీఆర్‌ ప్రస్తుతం.. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీలో నటిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్‌ దరశలో ఉంది. ఇదిలా ఉంటే తారక్‌ రాజకీయాల్లోకి రావాలని ఎప్పటి నుంచో ఫ్యాన్స్‌ నుంచి డిమాండ్‌ వినిపిస్తోంది. అయితే.. దానిపై తారక్‌ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే… తాజాగా “తెల్లవారితే గురువారం” సినిమా ఫంక్షన్‌కు జూ. ఎన్టీఆర్‌ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జూ. ఎన్టీఆర్‌ సీఎం అంటూ నినాదాలు మార్మోగాయి. ఈ ఫంక్షన్‌లో తారక్‌ మాట్లాడినప్పుడు అభిమానులు ఆనందంతో ఊగిపోయారు. అంతేకాదు… ఎన్టీఆర్‌ సీఎం.. సీఎం.. అంటూ నినాదాలు చేశారు. ఫ్యాన్స్‌ నినాదాలు హోరెత్తి జూనియర్‌ ప్రసంగానికి అడ్డంకిగా మారడంతో ఆయన వారిపై కాస్త సీరియస్‌ అయ్యారు. ఆగండి బ్రదర్స్‌.. అంటూ వారిని ఆపారు. ఆ తర్వాత తన ప్రసంగాన్ని తారక్‌ పూర్తి చేశాడు. అయితే.. పొలిటికల్‌ ఎంట్రీపై తారక్‌ ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడం ఫ్యాన్స్‌ను నిరాశపరిచింది.

Related posts