telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“పవర్ స్టార్” పేరుతో వర్మ సరికొత్త బిజినెస్

RGV

వివాదాస్పద దర్శకుడు తన లేటెస్ట్ మూవీ ‘పవర్ స్టార్’ విషయమై బడా దర్శకనిర్మాతలు సైతం షాకయ్యేలా కొత్త స్ట్రాటజీ అమలు చేయబోతున్నారట. పవన్ కళ్యాణ్ జీవిత కథ కాదంటూనే అచ్చం పవన్ లాంటి యాక్టర్‌ని పెట్టి ‘పవర్ స్టార్’ పేరుతో మూవీ రూపొందిస్తున్న రామ్ గోపాల్ వర్మ.. ఇప్పటికే పలు పోస్టర్స్ రిలీజ్ చేసి జనం దృష్టాంతా తన మూవీపైనే ఉండేలా చూసుకున్నారు. ఇక ఇప్పుడు ఆ ‘పవర్ స్టార్’ క్రేజ్‌ని విడుదలకు ముందే క్యాష్ చేసుకునేలా ఆయన సరికొత్త ప్రణాళిక రచించారని తెలిసింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా సినిమా ట్రైలర్‌ని కూడా డబ్బులు చెల్లిస్తేనే చూపించబోతున్నారట ఈ డిఫెరెంట్ డైరెక్టర్. పైగా ‘పవర్ స్టార్’ స్టామినా అలాంటిది కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నానని అంటున్నారట వర్మ. ఈ మేరకు పవర్ స్టార్ ట్రైలర్ చూడాలంటే ఒక్కో వ్యూ కోసం 10 రూపాయలు చెల్లించాలని, ఆ దిశగా ప్రస్తుతం వర్మ అడుగులు పడుతున్నాయని ఫిలిం నగర్ టాక్. ఒకవేళ ఇదే జరిగితే సినిమా ప్రమోషన్‌గా చెప్పుకునే ట్రైలర్‌కి కూడా డబ్బులు వసూలు చేసిన ఏకైక వ్యక్తి వర్మనే అవుతాడు.

Related posts