telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“3 మిలియన్ స్ట్రాంగ్”గా యంగ్ హీరో నితిన్

Nithin

యంగ్ హీరో నితిన్ త్వరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నితిన్, షాలిని ఎంగేజ్‌మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ‘భీష్మ’ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన యంగ్ హీరో నితిన్‌కు యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నితిన్ తాజాగా ఓ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. ట్విటర్‌లో 3 మిలియన్ల (30 లక్షలు) ఫాలోవర్లను సంపాదించుకున్నాడు. ఈ సందర్భంగా ట్విటర్ ద్వారా తన ఆనందాన్ని పంచుకున్నాడు. “3 మిలియన్ స్ట్రాంగ్! చాలా గర్వంగా ఉంది. నాపై ఇంతగా ప్రేమ చూపిస్తూ నా ప్రయాణంలో భాగమైన నా ఫాలోవర్స్ అందరికీ పెద్ద థ్యాంక్స్” అని నితిన్ పేర్కొన్నాడు.

Related posts