telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

తెల్లవారేదాకా.. ఓటేసింది.. ఇందుకేనా .. !

Voting

ఆంధ్రప్రదేశ్ కు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన వేళ, పలు ప్రాంతాల్లో ఓటర్లు, అందులోనూ మహిళలు తెల్లవారుజాము వరకూ క్యూలైన్లలో వేచి చూసి ఓట్లు వేశారన్న సంగతి తెలిసిందే. తామిచ్చిన పసుపు, కుంకుమ, డ్వాక్రా రుణాలు మహిళల్లో చైతన్యాన్ని తెచ్చాయని, వారంతా టీడీపీకి అండగా నిలవాలన్న ఉద్దేశంతోనే ఓట్లు వేసేందుకు వెల్లువలా వచ్చారని ఆ పార్టీ నేతలంతా చెప్పుకున్నారు. కానీ, వారు వచ్చింది టీడీపీకి ఓటు వేయడానికి కాదని, వారిలో అత్యధికులు వైసీపీనే ఎన్నుకున్నారని ఇప్పుడు తేలిపోయింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో సైతం ఎన్నడూ లేనంత భారీ విజయాన్ని వైఎస్ రాజశేఖరరెడ్డి తనయుడికి కట్టబెట్టేందుకు మహిళాలోకం తరలివచ్చిందని, జగన్ పై మహిళల అభిమానం ఓట్ల రూపంలో వెల్లువెత్తిందని ఇప్పుడు ఆ పార్టీ నేతలు అంటున్నారు. వాస్తవానికి ఇంత భారీ గెలుపును వైసీపీ నేతలు కూడా ఊహించలేదు. ఆ పార్టీ నేతలంతా పోలింగ్ తరువాతి రోజునుంచి తమకు 120 నుంచి 130 సీట్లు ఖాయమని మాత్రమే చెబుతూ వస్తున్నారు. మహిళలతో పాటు, యువత ఓట్లు ఈ ఎన్నికల్లో కీలకం అయ్యాయని, ఇంతకాలం టీడీపీకి అండగా నిలుస్తూ వచ్చిన బీసీ ఓటు బ్యాంక్, జగన్ వైపు మళ్లిందని, అదే కనీవినీ ఎరుగని వైసీపీ విజయానికి దారితీసింది.

Related posts