telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పవన్ ను వదిలేసి … మహేష్ ను పట్టుకున్న .. బండ్లగణేష్ …

bandla ganesh in bigg boss 3 conditions apply

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో బండ్ల గణేష్ పాత్ర గురించి తాజాగా వార్త ఇండస్ట్రీలో హల్ చల్ చేస్తుంది. సినిమాలో ఎక్కువగా కామెడీ ఎపిసోడ్ వుండేలా మహేష్ బాబు ముందు అనిల్ రావిపూడి తెలియజేయడంతో..గతంలో రవితేజ నటించిన ‘వెంకీ’ సినిమాలో ట్రైన్ ఎపిసోడ్ తరహాలో డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్లాన్ చేయడం జరిగింది. దీంతో సినిమా లో ఉండే ట్రైన్ ఎపిసోడ్ లో మహేష్ కాకుండా బండ్ల గణేష్ పై పూర్తి కామెడి ఉండేలా డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రంలో బండ్ల గణేష్ పాత్ర పేరు బ్లేడ్ గణేష్ అని వినిపిస్తోంది. బండ్ల గణేష్ పాత్ర ఓ కోటిశ్వరుడు కొడుకు క్యారక్టర్ అని, అతనికి విపరీతమైన డబ్బు ఉన్నా..బుర్ర మాత్రం ఉండదని..ఆ పాత్రలో గణేష్ చేసే చేష్టలు తెగ నవ్విస్తాయని అంటున్నారు.

రాజకీయాల్లో ఉన్న సమయంలో బండ్ల గణేష్ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే…మీడియా ముందు బ్లేడుతో పిక కోసుకుంటా అని బహిరంగంగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత…పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన బండ్ల గణేష్…కానీ ఇచ్చిన స్టేట్మెంట్ గురించి రకరకాలుగా మాట్లాడటంతో బండ్ల గణేష్ పై సోషల్ మీడియాలో ఆ సమయంలో రకరకాల వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా బండ్ల గణేష్ క్యారెక్టర్ బ్లేడ్ గణేష్ అని అనగానే సోషల్ మీడియాలో నెటిజన్లు అనిల్ రావిపూడి గతంలో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలను బేస్ చేసుకుని క్యారెక్టర్ తీర్చిదిది ఉంటారు అని కామెంట్ చేస్తున్నారు. మహేష్ బాబు ఈ సినిమాలో తొలిసారిగా ఆర్మీ ఆఫీసర్ క్యారెక్టర్ చేస్తున్నారు.

Related posts