telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమం : సోమువీర్రాజు సంచలన వ్యాఖ్యలు

Somu-Veerraju bjp

ప్రస్తుతంలో ఏపీలో రెండు విషయాలు హాట్ టాపిక్ గా ఉన్నాయి. అందులో ఒక్కటి పంచాయితీ ఎలక్షన్. మరొకటి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ. అయితే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేసేందుకు సిద్దమౌతున్న సంగతి తెలిసిందే.  దీంతో కార్మికులు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారు.  విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో కార్మికులు ఉద్యమం చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో  విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అంశంపై ఏపీ బీజేపీ చీఫ్‌ సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. ఆలయాలపై దాడుల విషయంలో వైసీపీ, టీడీపీ కుమ్మక్కు అయ్యాయని సోమువీర్రాజు తెలిపారు. ప్రభుత్వం టీడీపీతో చేతులు కలిపి బీజేపీని ఏకాకిని చేసిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆలయాలపై దాడుల అంశం నుంచి దృష్టి మరల్చేందుకే.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అంశాన్ని టీడీపీ, వైసీపీ తెరపైకి తెచ్చాయని ఆరోపణలు చేశారు సోమువీర్రాజు. స్టీల్‌ ప్లాంట్‌ ఉద్యమాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు. స్టీల్‌ ప్లాంట్‌పై కేంద్ర మంత్రి ఒక్క ప్రకటన చేయలేదని.. ఒక్క నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదు, మరి ఉద్యమం ఎందుకు ? అని సోమువీర్రాజు ప్రశ్నించారు. ఆలయాలపై దాడుల వ్యవహారాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లామని ఆయన తెలిపారు. 

Related posts