telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీకి హోదా ‘లేదు’.. ప్రత్యేక సాయం.. : కేంద్రం

కేంద్రం మరోసారి ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. కేంద్రహోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ఈ మేరకు లోక్‌సభలో నేడు లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై లోక్‌సభలో వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ అడిగిన ప్రశ్నకు నిత్యానందరాయ్ స్పందించారు.

ప్రత్యేక సాయం మాత్రమే చేస్తామని ప్రత్యేక హోదా ఇవ్వలేమని తేల్చి చెప్పారు. ప్రస్తుతం తాము ఏపీ, తెలంగాణల మధ్య సమస్యలపై దృష్టి సారించామని, త్వరలోనే వాటిని పరిష్కరిస్తామన్నారు. హోదా అంశం 14వ ఆర్థిక సంఘం సిఫార్సులతో పూర్తిగా మరుగున పడిందని నిత్యానంద్ స్పష్టం చేశారు. ఇటీవల కేంద్ర రక్షణ శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ కూడా ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇంకా ఏపీ ప్రభుత్వం స్పదించాల్సి ఉంది. అయితే జగన్ ఎన్నికల ముందు, కేంద్రంలో ఎవరు ఉన్నా కూడా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేవారికే మద్దతు ఇస్తామని స్పష్టంగా చెప్పిన విషయం తెలిసిందే. ఇక భారీ మెజారిటీతో గెలిచిన బీజేపీకి ఏపీ నుండి ఎటువంటి మద్దతు అవసరం లేకపోవటంతో, చిన్న చూపు తప్పదంటున్నారు విశ్లేషకులు. ఈ పరిస్థితులను జగన్ తనకు అనుకూలంగా ఎలా మార్చుకుంటారు అనేది చూడాల్సి ఉంది.

Related posts