యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో సుజీత్ దర్శకత్వం వహించగా, యూవీ క్రియేషన్స్ సంస్థ దాదాపు 300 కొట్లతో నిర్మించిన చిత్రం “సాహో”. ఈ చిత్రం భారీ అంచనాలతో ఆగస్టు 30న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కొంత మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం అదరగొడుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దక్షిణాది, ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా “సాహో” బాగానే కలెక్షన్స్‌ను రాబడుతోంది. అనుకున్నట్టుగానే తొలి రోజు రికార్డు స్థాయి కలెక్షన్లు సాధించింది. 350 కోట్ల రూపాయల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘సాహో’కు డివైడ్ టాక్ వచ్చినా తొలి రోజు మాత్రం అదరగొట్టింది. ‘సాహో’ హిందీ వెర్షన్ తొలి రోజు 24 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించింది. తొలి రోజు కలెక్షన్లలో ‘బాహుబలి-2’ తర్వాత ‘సాహో’ రెండో స్థానంలో నిలిచింది. ‘బాహుబలి-2’ హిందీ వెర్షన్ తొలి రోజే 41 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించింది. ఆ తర్వాత స్థానంలో ‘సాహో’ నిలిచింది. ఇక దేశవ్యాప్తంగా ‘సాహో’ సినిమా తొలి రోజు 70 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిందని వార్తలు వస్తున్నాయి. ‘బాహుబలి-2’ తొలి రోజు దేశవ్యాప్తంగా తొలి రోజు 121 కోట్ల రూపాయలు సాధించింది. ఇక వీకెండ్ లో ఈ సినిమా కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందంటున్నారు సినీ విశ్లేషకులు.
previous post
ఆ సినిమా వలన అప్పులపాలయ్యా