telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ హీరోయిన్ తో ఆదిపినిశెట్టి ప్రేమాయణం… !

Aadi

దక్షిణాదిన మోస్ట్‌ బ్యాచులర్‌ హీరోల లిస్ట్‌లో ఆది పినిశెట్టి ఒకరు. 37 సంవత్సరాలున్న ఈ హీరో ఓ హీరోయిన్‌తో ప్రేమలో ఉన్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళం, మలయాళంలో పలు సినిమాల్లో నటించిన నిక్కీ గర్లానీ (హీరోయిన్ సంజన సోదరి), ఆది ప్రేమలో ఉన్నట్లు పలు మార్లు పుకార్లు వచ్చాయి. వీరిద్దరు మలుపు, మరకతమణి చిత్రాల్లో నటించగా.. రెండు మంచి విజయాన్ని సాధించాయి. ఆ క్రమంలోనే ఈ ఇద్దరు ప్రేమలో పడ్డట్లు టాక్ నడిచింది. ఇక వీటన్నింటికి బలం చేకూరుస్తూ.. ఇటీవల ఆది ఫ్యామిలీ ఫంక్షన్‌లో భాగమైంది నిక్కీ. ఆది పినిశెట్టి తండ్రి, ప్రముఖ దర్శకుడు రవిరాజా పినిశెట్టి పుట్టినరోజు వేడుక ఇటీవల చెన్నైలో జరిగింది. లాక్‌డౌన్ నేపథ్యంలో ఈ వేడుకకు ఎవరినీ పిలవలేదు. అయితే ఈ కార్యక్రమంలో నిక్కీ భాగమైంది. బర్త్‌డే వేడుకలకు సంబంధించి ఆది సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలలో నిక్కీ కూడా ఉంది. దీంతో వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లు మరోసారి రుజువైంది. మరి దీనిపై ఈ జంట ఎలా స్పందిస్తుందో చూడాలి.

Related posts