telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

బీజేపీ హయాంలో .. తెలుగు రాష్ట్రాల విభజనపై .. ప్రధాని వ్యాఖ్యలు..

modi on telugu states separation

బీహార్‌ ప్రచారంలో ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల విభజనపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన విషయాన్ని ఆయన లేవనెత్తారు. వాజ్‌పేయి హయాంలో మూడు రాష్ట్రాల విభజన సాఫీగా జరిగిందని చెప్పారు. విభజన జరిగి ఐదేళ్లయినా సమస్యలు అలానే ఉన్నాయని తెలిపారు. రెండు రాష్ట్రాల్లో తెలుగు మాట్లాడే ప్రజలే ఉన్నా ఇప్పటికీ ఒకరి కళ్లలో ఒకరు చూసుకోలేని పరిస్థితి ఉందని మోదీ స్పష్టం చేశారు.

చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌ను తెలంగాణ (ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్ నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాలు), ఆంధ్రప్రదేశ్ (అనంతపురం, చిత్తూరు, కడప, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు ) రాష్ట్రాలుగా విభజించవలసివచ్చింది. 2014 జూన్ 2న అధికారికంగా విభజన జరిగి రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. ఇంకా ఆస్తిపంపకాలు జరగకపోవటం, రెండు రాష్ట్రాలపై రాజకీయ నాయకుల పెత్తనంతో.. సమస్యలు రోజురోజుకు ఎక్కువ అవుతున్నాయి. మధ్యలో ప్రజలు బలిపశువులవుతున్నారు.

Related posts