telugu navyamedia
సినిమా వార్తలు

రామరావు ఆన్ డ్యూటీ, ధమాకా నుంచి రవితేజ పోస్టర్స్ రిలీజ్‌..

మాస్ మహారాజా రవితేజ పుల్ జోష్ మీద ఉన్నాడు. వ‌రుస సినిమాల‌తో దూసుకుపోతున్నాడు. ఓవైపు ఖిలాడీ , రామరావు ఆన్ డ్యూటీ, వీటితోపాటు ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.

ర‌వితేజ హీరోగా నటిస్తున్న వరుస చిత్రాలలో ‘రామారావు ఆన్ డ్యూటీ ఒక‌టి . ఈ సినిమాలో దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.

.

ఈ సినిమాను ఎస్ఎల్‌వీ సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్లే. విదేశాల్లో పాటలను చిత్రీకరించాలని చూస్తున్నారు. ఈ సినిమాను మార్చి 25న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఈరోజు రవితేజ పుట్టినరోజు సందర్భంగా ఆయన హీరోగా నటిస్తున్న ‘ఖిలాడి’, ‘రామారావు ఆన్ డ్యూటీ’, ‘ధమాకా’ సినిమాల నుంచి అప్డేట్స్ వచ్చేశాయి. రవితేజకు బర్త్​డే విషెస్ చెబుతూ పోస్టర్స్ రిలీజ్ చేశారు.

.

ఈ పోస్టర్‌లో రవితేజ ట్రెండీ వేర్‌లో ఫుల్ఎనర్జీగా కనిపిస్తున్నారు. ఇక ఈ డ్యాన్స్ మూమెంట్ ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకునేలా ఉంది. మొత్తానికి ఈ స్పెష‌ల్ పోస్టర్స్‌లో కలర్ ఫుల్‌గా ఉంది.

.

వీటిలో ఖిలాడి.. ఫిబ్రవరి 10న, రామారావు ఆన్ డ్యూటీ.. మార్చి 25న థియేటర్లలోకి రానుంది. వీటితోపాటు ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.

Related posts