telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘ఆకాశం నీ హద్దురా’ సినిమాలో మోహన్ బాబు లుక్ అదిరింది

mohan-babu

తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ‘సూరరై పోట్రు’ తెలుగులో ‘ఆకాశమే నీ హద్దురా’ పేరుతో విడుదల కానుంది. ఈ సినిమాలో విలక్షణ నటుడు మోహన్‌బాబు ముఖ్యపాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు విడుదల చేసిన ప్రోమోస్, సాంగ్స్ ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ చిత్రంలో మోహన్ బాబు క్యారెక్టర్ నేమ్ రివీల్ చేస్తూ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సినిమాలో మోహన్ బాబు పాత్ర పేరు ‘భక్త వత్సలం నాయుడు’. ఇది ఆయన అసలు పేరు కావడం విశేషం. ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జీఆర్ గోపీనాథ్ జీవితాధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకురాలు సుధ కొంగర. ఆస్కార్ అవార్డు గ్రహీత గునీత్ మోంగాతో పాటు సూర్య ఈ సినిమాను నిర్మాతగా వ్యవహరించారు. ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ వినోద్ మాల్యా అనే పాత్రలో నటించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించారు. ఇటీవల ఈ సినిమాలోని తొలి పాటను చాలా గ్రాండ్‌గా రిలీజ్ చేసారు. దాదాపు వంద మంది అనాథ పిల్లలను సూర్య విమానంలో ఎక్కించారు. ఈ సినిమాలో జేబులో ఆరు వేల రూపాయలు పెట్టుకుని పట్టణం వచ్చిన వ్యక్తి విమాన కంపెనీని ఎలా స్థాపించాడు? ఆ సమయంలో ఆయన ఎదుర్కొన్న సవాళ్లు ఇందులో చూపించనున్నారు. తన పాత్రకు తెలుగుతోపాటు, తమిళంలోనూ మోహన్‌బాబే డబ్బింగ్‌ చెప్పుకోవడం మరోవిశేషం. ఈ విషయాన్ని ఓ నెటిజన్‌ శుక్రవారం ట్విటర్‌లో పోస్ట్‌ చేయగా.. దీనిపై మంచు లక్ష్మీ స్పందించారు. ‘‘ఓహ్‌ నాన్న తన పుట్టిన పేరును సినిమాలో ఉపయోగించారని నాకు తెలియదు. యూనిఫామ్‌లో నాన్న ఎంత అందంగా ఉన్నాడో. మా నాన్న ఓ అద్భుతం.’’ అంటూ ట్వీట్‌ చేశారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం తమిళ్, తెలుగులో త్వరలో విడుదల కానుంది. ఏప్రిల్ 9న సినిమా రిలీజ్ కానుంది.

Related posts