టాలీవుడ్ టాప్ విలన్స్ లో సంపత్‌రాజ్ ఒకరు ‘మిర్చి’ సినిమాతో విలన్‌గా మెప్పించిన సంపత్‌రాజ్.. ఆ తర్వాత తెలుగులో ఎన్నో విభిన్న పాత్రలు చేస్తూ చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేసుకున్నాడు. తాజాగా ఓ టీవీ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన ఈ సందర్భంగా తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.
అమ్మనాన్నల పెళ్లి ఎలా జరిగిందనే విషయాన్ని కూడా వెల్లడించారు. ‘మా నాన్న పెళ్లిచూపుల కోసం యూనిఫామ్‌లో వెళ్లినప్పుడు అమ్మ ఇల్లు కడుగుతోందట. ఆమెను చూసి ఎవరో పనిమనిషి అనుకున్నాడట. ఆయన్ను చూడగానే అమ్మ పరుగెత్తుకుంటూ లోపలకు వెళ్లి పోలీసులొచ్చారని చెప్పింది. అలా వాళ్ల మొదటి పరిచయం జరిగింది. తాము మొత్తం ఏడుగురు సంతానమని చెప్పిన సంపత్ రాజ్.. తమకు పేర్లకు బదులు వారాల పేర్లు పెట్టుంటే సరిపోయేదని అమ్మతో అనేవాడనని తెలిపారు. ఓ సినిమా కోసం ఓ నటుడితో రెండు నెలలపాటు కపుల్‌లా ఓ ఇంట్లో ఉన్నానని కూడా చెప్పారు.
నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ ఇవ్వకపోతే లొకేషన్‌కు వచ్చి కెమెరా ఎత్తుకెళ్లిపోతానని ఓ డైరెక్టర్‌ను సరదాగా బెదిరించానని చెప్పుకొచ్చాడు. ఎఫ్ 3 షూటింగ్ లో సునీల్ ని కూడా త్రివిక్రమ్ గురించి అడిగాను. సునీల్ ఆయన ఉండే ఆఫీస్ అడ్రస్ నాకు చెప్పాడని, సంపత్ తెలిపారు. త్రివిక్రమ్ తెరకెక్కించిన సన్ ఆఫ్ సత్యమూర్తి, అజ్ఞాతవాసి చిత్రాలలో సంపత్ విలన్ రోల్స్ చేశారు.
ఆర్టిస్ట్ శరణ్య.. తన మాజీ భార్య అంటూ వస్తున్న వార్తలపై స్పందించారు. ఓ సినిమాలో నేను, శరణ్య భార్యభర్తలుగా నటించామని..దీంతో ఎవరో ఆ ఫోటో పెట్టి ఎక్స్ వైఫ్ అంటూ రాసేశాడని.. యూట్యూబ్‌లో అలా రాసుకొచ్చేశారని తెలిపారు. శరణ్య, తను కేవలం స్నేహితులము మాత్రమే అని చెప్పుకొచ్చారు. శరణ్య కుటుంబం తనకు చాలా క్లోజ్ అని.. ఆమె భర్త కూడా తన స్నేహితుడని.. కానీ మా ఇద్దరిపై వచ్చిన రూమర్స్ పై ఎలా స్పందించాలో అర్థం కాలేదని తెలిపారు.