telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

గాయత్రి మంత్రంతో మంత్రముగ్ధుల్ని చేస్తున్న చిన్నారి సెలెబ్రిటీ…!

Inanya

చిన్నారులు మాట్లాడినా, పాటలు పాడినా ముద్దుముద్దుగా ఉంటుంది. మరి చిన్నారులు మంత్రాలు చదివితే ఎలా ఉంటుందో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. తాజాగా కునాల్ కెమ్ము, సోహా అలీఖాన్ గారాల ప‌ట్టి ఇన‌న్య గాయ‌త్రి మంత్రాన్ని ఒక్క త‌ప్పు లేకుండా చెప్పింది. మంగళ‌వారం భాయీ ధూజ్ సంద‌ర్భంగా సోహా త‌న సోద‌రుడికి హార‌తి ప‌డుతూ గాయ‌త్రి మంత్రం ఉచ్చార‌ణ చేసింది. ఆమె చెప్పింది విన్న అన‌న్య వెంట‌నే మంత్రాన్ని ఎంతో ముద్దుగా ప‌ఠించింది. ఈ వీడియోని కునాల్ త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయ‌డంతో వైర‌ల్ అయింది. రెండేళ్ళ చిన్నారి ఇనన్య‌కి పండుగ‌లంటే ప్ర‌త్యేక శ్ర‌ద్ధ అని చెబుతుంది సోహ‌. బాలీవుడ్ ప్ర‌ముఖులు ఆనంద్ తివారీ, ప‌రిణితీ చోప్రా, విక్కీ కౌశ‌ల్‌తో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు చిన్నారిపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

 

View this post on Instagram

 

Here’s to spreading light this Bhai Dooj #happybhaidooj

A post shared by Kunal Kemmu (@khemster2) on

Related posts