telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎన్టీఆర్ బర్త్ డే… “హ్యాపీబర్త్‌డేఎన్టీఆర్” హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాను షేక్

Jr.ntr actor Ycp photos social media

నేడు యంగ్ టైగర్ నందమూరి తారక రామారావు పుట్టిన రోజు. ఈ సందర్భంగా “హ్యాపీబర్త్‌డేఎన్టీఆర్” హ్యాష్ ట్యాగ్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 1983లో మే 20న జన్మించిన తారక్ ఈ పుట్టినరోజుతో 36వ యేడులోకి అడుగుపెట్టారు. విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు మనవడిగా, ఆయన నట వారసత్వాన్ని పుణికి పుచ్చుకుని తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులేని స్టార్‌డమ్ తో అగ్ర స్థానాన్ని సొంతం చేసుకున్నారు తారక్. “బాలరామాయణం” సినిమాతో నటప్రస్థానం మొదలుపెట్టిన ఎన్టీఆర్ “నిన్ను చూడాలని ఉంది” చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యారు. ఆ తరువాత వరుసగా స్టూడెంట్ నెంబర్ 1, ఆది, సింహాద్రి, యమదొంగ, బృందావనం, టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జై లవ కుశ, అరవింద సమేత వంటి వైవిధ్య చిత్రాలతో వెనుదిరిగి చూడకుండా టాలీవుడ్ శిఖరాగ్రానికి చేరుకున్నారు. త్వరలో రికార్డులు సృష్టించబోతున్న “ఆర్ఆర్ఆర్”లో “కొమరం భీమ్” పాత్రలో నట విశ్వరూపాన్ని ప్రదర్శించబోతున్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. తాజాగా ఎన్టీఆర్ బర్త్‌డేను పురస్కరించుకుని ప్రముఖ దర్శకులు, నిర్మాతలు, అభిమానులు.. తారక్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వరుసగా ట్వీట్స్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో “హ్యాపీబర్త్‌డేఎన్టీఆర్” ట్యాగ్ ట్రెండింగ్‌లో టాప్ స్థానాన్ని సొంతం చేసుకుంది.

Related posts