telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

అమెజాన్ ప్రైమ్‌లో దృశ్యం 2…

mohanlal

చైనా నుండి వచ్చిన కరోనా కారణంగా దాదాపు ఎనిమిది నెలలు ప్రపంచం స్తంభించిపోయింది. అందులో నష్టపోయిన వాటిలో సినిమా పరిశర్మ కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు మళ్ళీ సినిమా తిరిగి చిత్రీకరణలు మొదలు పెట్టాయి. అలాగే థియేటర్లు కూడా మూతబడి ఇటీవల తెరుచుకున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో థియేలర్ల పరిస్థితేంటి. కరోనా పుణ్యమా అంటూ ప్రేక్షకులందరూ ఓటీటీ నామస్మరణ చేస్తున్నారు. కరోనా సమయంలో కొత్త సినిమాలను ఓటీటీలు వేదికగా విడుదల చేయడంతో ప్రేక్షకులు వాటికి అలవాటు అయ్యారు. ఇప్పుడు థియేటర్ల తెరుచుకున్నా వాటి వంక కూడా ఎవరూ చూడట్లేదు. సాధారణంగా థియేటర్లు సినిమాలపైన సినిమాలు థియేటర్లపైన ఆధారపడి ఉంటాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో థియేటర్లకు కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్క సినీ రంగ నటుడికి ఉంటుంది. వారి సినిమాలను థియేటర్లలో విడుదల చేసి ప్రేక్షకులను థియేటర్ల బాట పట్టించాలి. అటువంటిది సూపర్ స్టార్లే కొత్త సినిమాలను ఇంకా ఓటీటీలలో విడుదల చేస్తే థియేటర్లు అండగా ఎవరు నిల్చుంటారు. చిన్న సినిమాలంటే పర్వాలేదు కానీ స్టార్ హీరోల సినిమాలు కూడా ఇంకా ఓటీటీల్లో విడుదలైతే థియేటర్ల పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందని విశ్లేషకులు కూడా చెబుతున్నారు. కానీ కొందరు స్టార్‌లు మాత్రం అది వినిపించుకోవడం లేదు. వారిలో కన్నడ సూపర్ స్టార్ మోహన్ లాల్ కూడా ఉన్నాడు. అతడి నూతన సినిమాను దృశ్యం2ను అమెజాన్ ప్రైమ్‌లో విడుదలకు సిద్దం చేస్తున్నాడు. నాలుగు నెలలుగా ఈ సినిమా విడుదలపై చర్చలు జరిపి ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించారట. ఈ సినిమాకు అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తాన్ని ఆఫర్ చేయడంతో ఓకే చెప్పారట. చూడాలి మరి ఈ సినిమా కూడా హిట్ అవుతుందా… లేదా అనేది.

Related posts