ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కబడ్డీ ఆడుతూ కిందపడిపోయారు. శ్రీకాకుళంజిల్లా ఆముదాలవలసలో గురువారం క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఆయన.. ఆటగాళ్లలో ఉత్సాహం నింపేందుకు తాను కూడా ప్లేయర్‌గా బరిలోకి దిగారు. కబడ్డీ ఆడుతూ అక్కడున్న వాళ్లందర్నీ హుషారెత్తించారు. ఈ క్రమంలో కాలు స్లిప్ కింద పడిపోయారు. సీతారాం కిందపడగానే సిబ్బందితో పాటు ప్లేయర్లు అప్రమత్తమయ్యారు. వెంటనే సీతారాంను పైకి లేపారు. ఈ ఘటనలో ఆయనకు ఎలాంటి గాయాలు కాలేదు.
శ్రీకాకుళంజిల్లా ఆముదాలవలసలో పొట్టి ప్రో కబడ్డీ క్రీడా పోటీలు ప్రారంభం అయ్యాయి. రాష్ట్రంలో సీఎం కప్ పేరుతో టోర్నమెంట్లు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస జూనియర్ కాలేజీ వేదికగా ఆ నియోజకవర్గం స్దాయి సీఎం కప్ క్రికెట్, కబడ్డీ టోర్నమెంట్ ను ప్రారంబించారు ఎపీ స్పీకర్ తమ్మినేని సీతారాం.