telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రియాలిటీ షోకు హోస్ట్ గా సమంత ?

Samnatha

సమంత తాజాగా తమిళ్‌లో చిత్రం ‘కదవుక్కుళ్ల రెండు కాదల్‌’. (తెలుగులో ‘తలుపు వెనుక రెండు ప్రేమకథలు’ అని అర్థం) సినిమా కమిట్ అయింది. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరో, లేడి సూపర్ స్టార్ నయనతార మరో కథానాయికగా నటించనుంది. నయన్ ప్రియుడు విఘ్నేష్ శివన్ డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే సమంత ఓ రియాలిటీ షోకి హోస్ట్‌గా కనిపించనుందని తెలుస్తోంది. ఇటీవలే డిజిటల్ రంగంలోకి ఎంటర్ అయిన ఓటీటీ యాప్ కోసం రూపొంద‌నున్న‌ షోలో హోస్ట్‌గా క‌నిపించ‌నుంద‌ట‌ సామ్. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్రారంభించిన ‘ఆహా’ ఓటీటీ కోసం సమంతతో ఓ రియాలిటీ షో ప్లాన్ చేస్తున్నారు. కింగ్ నాగార్జున హోస్ట్ చేసిన ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ తరహాలోనే ఈ రియాలిటీ షో ఉండబోతుందని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో రానుంది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానున్న ‘ఫ్యామిలీ మేన్ 2’ వెబ్ సిరీస్‌లో నటిస్తోంది. సమంత పెళ్లి తర్వాత లేడి ఓరియంటెడ్ సినిమాలతో ఆకట్టుకుంది. ‘మజిలీ’, ‘జాను’ వంటి కూల్ మూవీస్‌లో కథానాయికగా అలరించింది. ‘జాను’ తర్వాత సమంత అక్కినేని ఏ సినిమా చేయబోతోంది.. అంటే తెలుగు విషయంలో క్లారిటీ లేదు కానీ ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్లో రూపొందనున్న చిత్రంలో నటించనుందని వార్తలు వస్తున్నాయి.

Related posts