telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కౌబాయ్ గా అఖిల్… చిన్నప్పటి పిక్ వైరల్

Akhil

యంగ్ హీరో అఖిల్ అక్కినేని హీరోగా మూడు సినిమాలు చేసినప్పటికీ సరైన హిట్ అందుకోలేదు. కాగా ప్రస్తుతం అఖిల్ దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీ చేస్తున్నారు. పూజ హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ మూవీపై అఖిల్ చాలా ఆశలే పెట్టుకున్నారు. 2021లో సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనేది, నిర్మాతల ఆలోచనగా తెలుస్తుంది. అయితే తాజాగా అఖిల్ కు సంబంధించిన అరుదైన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. హ్యట్ పెట్టుకొని చేతిలో గన్ తో కౌ బాయ్ గెటప్ లో ఉన్న బుల్లి అఖిల్ ఫోటో ఆసక్తికరంగా ఉంది. ఆ ఫోటో నేపథ్యంలోకి వెళితే, 2002లో మహేష్ “టక్కరి దొంగ” మూవీ చేశారు. ఆ మూవీ సెట్స్ కి వెళ్లిన అఖిల్ కౌ బాయ్ గెటప్ లోకి మారడం జరిగింది. ఇక చిన్నప్పుడే అఖిల్ “సిసింద్రీ” చిత్రంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన విషయం తెలిసిందే.

Related posts