telugu navyamedia
సినిమా వార్తలు

మందు సీసాతో భీమ్లానాయక్‌..

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్ , దగ్గుబాటి రానా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘భీమ్లానాయక్‌’​. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా మలయాళంలో హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియం తెలుగు రీమేక్ గా రూపొందుతోంది.

ఇందులో పవన్‌కల్యాణ్‌.. భీమ్లానాయక్‌ అనే పోలీస్‌ పాత్రలో కనిపించ‌గా.. రానా.. డేనియల్‌ శేఖర్‌గా అలరించనున్నారు.. పవన్‌కు జోడీగా నిత్యామేనన్ నంటించ‌గా రానాకు జోడీగా సంయుక్త మేనన్‌ సందడి చేయనున్నారు.

Pawan Kalyan, Nithya Menen's 'Bheemla Nayak' second single 'Antha Ishtam'  out | Telugu Movie News - Times of India

ఈ సినిమాలోని ‘లాలా భీమ్లా’ సాంగ్​కు సంబంధించిన ప్రోమోను ఈరోజు(నవంబరు 3) సాయంత్రం 7.02 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలుపుతూ ఓ పోస్టర్​ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో పవన్​ మాస్​ లుక్​లో నుదుటిపై తిలకం దిద్దుకుని,  మందు సీసా, బాంబులను ముందుపెట్టుకుని  కూర్చొని కనిపించారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా స్పెషల్‌ వీడియోలు, పాటలు ప్రేక్షకుల్ని ఎంతగానో అలరిస్తున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related posts