డాషింగ్ డైరెక్టర్ ఫూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న లెేటెస్ట్ స్పోర్ట్స్ డ్రామా ‘లైగర్’. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్‌తో పాటు పోస్టర్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఆగస్టు 25న విడుదలవుతోంది. దీంతో ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుదర్శన్ థియేటర్‌లో లైగర్ ట్రైలర్ ఫస్ట్ ప్రీమియర్ అట్టహాసంగా జరిగింది. హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ అనన్యా పాండే, డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ప్రొడ్యూసర్స్ కరణ్ జోహార్, చార్మీ కౌర్ ఈ వేడుకలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పూరీ జగన్నాథ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అన్నా ఎట్లుంది ట్రైలర్.? విజయ్ ఎంట్లున్నాడు. మాకి కిరికిరి చింపేశాడు సినిమా .. విజయ్ ఇండియాలో నెక్ట్స్ బిగ్ థింగ్.. రాసిపెట్టుకోండి.. సినిమా మామూలుగా ఉండదంటూ పేర్కోన్నారు.
కరణ్ జోహార్ ను ఇక్కడకి పిలిచింది ట్రైలర్ చూపించడానికి కాదు.. మిమ్మల్ని (తెలుగు ప్రేక్షకులను ) చూపించడానికి పిలిచా.. మాకు సినిమా అంటే ఎంత పిచ్చో చూపించడానికి పిలిచా అన్నారు. నెలరోజులు ఉంది సినిమా రిలీజ్ కు ఇలానే ఉండండి.. ఇలానే ఉంటుంది కుమ్మేద్దాం.. అన్నారు పూరి
అమ్మాయి నచ్చితే ఫస్ట్ డేనే అడిగేస్తా… రామ్ గోపాల్ వర్మ సంచలన వర్మ