telugu navyamedia
సినిమా వార్తలు

ఆసుపత్రిలో చేరిన బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ ..

బాలీవుడ్ హీరో.. బిగ్ బీ అమితాబ్ తనయుడు అభిషేక్ బచ్చన్ గాయపడ్డారు. ప్రస్తుతం అభిషేక్ నటిస్తున్న ‘బాబ్ విశ్వాస్’ సినిమాలో నటిస్తున్న షూటింగ్ సందర్భంగా సెట్ లో గాయపడి మూడు రోజులు అవుతోంది. ఈ ప్రమాదాల్లో ఆయన చేతికి ఫ్రాక్చర్ అవ్వ‌డంతో ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొంది ఆరోజే డిశార్చ్ అయ్యారు.

హాస్పిటల్‌లో చేరిన సమయంలో చేతికి బ్యాండేజ్‌తో కూడిన ఫోటోలు బయటకు వచ్చాయి. భుజానికి చేతికి పట్టి వేసుకొని అభిషేక్ ఆ ఫోటోల్లో కనిపించారు. అభిషేక్‌కు చూసేందుకు తండ్రి అమితాబ్ బచ్చన్, సోదరి శ్వేత బచ్చన్ ఆసుపత్రికి వెళ్లారు.

అయితే ఐశ్వర్యరాయ్‌ మాత్రం ఎక్కడా కనిపించలేదు. నిజానికి ఆమె మణిరత్నం డైరెక్షన్‌లో పొన్నియన్ సెల్వం అనే చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుంది. 

Abhishek Bachchan hospitalized after getting injured during the shoot of Hindi remake of 'Oththa Seruppu Size 7' - Box Office Worldwide

అయితే అభిషేక్ కు గాయాలైనట్టు వస్తున్న వార్తలపై ఆయన కుటుంబం గాని, చిత్రయూనిట్ గాని స్పందించకపోవడంతో ఫేక్ న్యూస్ గా భావించారు. అభిషేక్ ఆసుపత్రికి వెళ్తున్న ఫోటోలు బయటకి రావటంతో నిర్దారణ అయింది.

కాగా, అభిషేక్ గాయంపై లీలావతి సీఈఓ స్పందించారు. అభిషేక్ గాయపడ్డారని.. అయితే చిన్న గాయమని చెప్పారు. చికిత్స అనంతరం అభిషేక్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి కూడా వెళ్లిపోయాడని చెప్పారు. 

Related posts