telugu navyamedia
సినిమా వార్తలు

ఆగష్టులో రానున్న “సైరా” ?

Syeraa
స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి ప్రధాన పాత్రలో “సైరా నరసింహారెడ్డి” చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను రామ్ చరణ్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఆగష్టులో విడుదల చేస్తామని ప్రకటించిన ఈ సినిమాను వేసవిలో విడుదల చేస్తారంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో అభిమానులు కాస్త నిరాశ పడ్డారు. అయితే ఇప్పుడు సినిమాను ఆగష్టు లోనే విడుదల చేయాలని భావిస్తున్నారట దర్శకనిర్మాతలు. మార్చి మొదటివారంలో ప్రధానమైన పాత్రలకు సంబంధించిన కొన్ని కీలకమైన సన్నివేశాలతో సినిమా చిత్రీకరణ పార్ట్ పూర్తవుతుందని తెలుస్తోంది. ఆ తరువాత పోస్ట్ ప్రొడక్షన్ పనులు మాత్రమే ఉంటాయి కాబట్టి సినిమా ఆగష్టులో విడుదల కావడం ఖాయమని టాక్. త్వరలోనే చిత్రబృందం సినిమా విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది.

Related posts