telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

డ్రగ్స్ తో పట్టుబడ్డ ప్రముఖ నిర్మాత భార్య.. .అరెస్ట్

Firoz Naadiyawala

బాలీవుడ్‌లో డ్రగ్స్ కలకలం ఇంకా కొనసాగుతోంది. సినిమా ప్రముఖులు డ్రగ్స్ తో పట్టుబడుతూనే ఉన్నారు. ఇప్పటికే డ్రగ్స్ కేసులో పలువురిపై విచారణ కొనసాగుతుండగా తాజాగా ప్రముఖ నిర్మాత ఫిరోజ్ నదియడ్‌వాలా భార్య షబానా సయీద్‌ను ఆదివారం నార్కోటిక్స్ కంట్రోల్ అధికారులు అరెస్ట్ చేశారు. ఐదు రోజుల క్రితం సబర్బన్‌లోని జూహూలో గల ఆమె నివాసంలో 10 గ్రాముల గంజాయి దొరికింది. షబానా దాన్ని ఓ వ్యక్తి నుంచి కొనుగోలు చేసినట్లు తేలడంతో ఎన్సీబీ అధికారులు ఆదివారం ఆమెను విచారణకు పిలిచారు. విచారణ అనంతరం షబానాను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఫిరాజ్‌ భార్య షబానాను నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌ (ఎన్‌డీపీఎస్‌) చట్టం కింద అరెస్టు చేసినట్లు జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖేడే తెలిపారు. దీనిపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ కోసం ఎన్సీబీ అధికారులు ఫిరోజ్‌ను కూడా రావాల్సిందిగా ఆదేశించినప్పటికీ ఆయన హాజరుకాలేదు.

Related posts