telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

కాసేపట్లో స్మగ్లర్ బాషాను మీడియా ముందుకు తీసుకురానున్న పోలీసులు…

కడప పోలీసులు స్మగ్లర్ బాషా గ్యాంగ్ పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.  కడప శివార్లలోని పోలీసు శిక్షణా కేంద్రంలో రెండు రోజులుగా బాషా భాయ్ తో పాటు అతని అనుచరులను పోలీసు అధికారులు సుధీర్ఘంగా విచారిస్తున్నారు.. రేపు ఉదయం భాష భాయ్ ని మీడియా ముందుకు తీసుకురానున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్  వ్యవహారంలో కీలకంగా భావిస్తున్న భాష భాయ్ అలియాస్ హకీమ్ ను కడప పోలీసులు రెండల రోజూ విచారిస్తున్నారు.. మొన్న రాత్రి కోయంబత్తూరు నుంచి కడపకు తీసుకువచ్చిన భాష భాయ్ తో పాటు అతని అనుచరులను పోలీసులు వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నారు. విచారణలో ప్రధానంగా బాషా భాయ్ తో సంబంధాలున్న లోకల్ గ్యాంగ్ , తమిళ గ్యాంగుల వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం.. అలాగే కడప శివార్లలో జరిగిన ఘటనలో తమిళ గ్యాంగును అటాక్ చేసిన లోకల్ గ్యాంగులో ముగ్గురిని కూడా పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది.. అలాగే ప్రమాదానికి గురైన వాహనం నుంచి తప్పించుకున్న వారిని కూడా పోలీసులు విచారిస్తున్నారు.

ప్రమాదం జరిగిన రోజు ఏం జరిగింది.. ఎర్రచందనం ఎక్కడి నుంచి తీసుకువచ్చారు.. ఎక్కడి తీసుకెళ్తున్నారు.. ఏ మార్గాల్లో స్మగ్లింగ్ వ్యవహారాలు జరుగుతున్నాయన్న కీల విషయాలను భాష నుంచి రాబట్టినట్లు తెలుస్తోంది. అలాగే భాషా భాయ్ ఇచ్చిన సమాచారంతో అతనికి సహకరిస్తున్న  కమలాపురం, కడప, రాయచోటి ప్రాంతాల్లోని లోకల్ గ్యాంగ్స్ లో మరో ఆరు మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది.. అలాగే ఎర్రచందనం స్మగ్లింగ్ కార్యకలాపాల్లో స్ధానికంగా, ఇతర రాష్ట్రాల్లో ఉన్న గ్యాంగ్స్ వివరాలను కూడా భాషా భాయ్ ద్వారా సేకరించినట్లు సమాచారం. భాషా భాయ్ ని రేపు మీడియా ముందు ప్రవేశపెట్టిన తర్వాత కోర్టుకు హాజరపరిచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.. కోయంబత్తూరులోని గోదాములో నిల్వ ఉంచిన ఎర్రచందనం దుంగలను, కడప జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భాషా స్టాక్ చేసిన దుంగలు , వాహనాలను సీజ్ చేసినట్లు సమాచారం భాషా తో పాటు మరో ఐదు మందిపై కేసు నమొదు చేసినట్లు తెలుస్తుంది. 

Related posts